-
విజయవాడ ఏడవ డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
-
ముంపు బాధితుల సహాయక చర్యలు పర్వేక్షిస్తూ, ఆహారం అందజేస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
విజయవాడ సెప్టెంబర్ 04: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి నారా ఆదేశాల మేరకు విజయవాడలోని ఏడవ డివిజన్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ముంపు బాధితులకు ఆహారం అందజేస్తూ, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బుధవారం ముఖ్యంగా అల్లూరి పరమాత్మ వీధి బందుల దొడ్డి సెంటర్ చంద్ర నాగేశ్వరరావు నగర్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధితులకు భరోసా కల్పిస్తూ శ్రీ కనక దుర్గాదేవి ఆలయం మాజీ చైర్మన్ ఐఏఎస్ సూర్యకుమారి ఏడవ డివిజన్ నాయకులు పడమటి సతీష్ బెల్లం కొండ రమణ, సాయి సాత్విక్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సాయి శ్రీనివాసులు కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘోరమైన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని వారి కష్టం చెప్పటానికి మాటలు రావడం లేదని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.
బాధితులందరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటూ నిరంతరం అధికారులతో సహాయక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారని ఎవరు అధైర్య పడద్దని బాధితులను తప్పక ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాలపాటి చైతన్య, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాస్ మధు రెడ్డి ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ దోమకొండ రవికుమార్ మాజీ కార్పొరేటర్ దోమకొండ రత్నాకర్ టి ఎన్ ఎస్ ఎఫ్ జనరల్ సెక్రెటరీ రేపాకుల శ్రీనివాస్ మహిళ ప్రెసిడెంట్ కోటా శివలక్ష్మి స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.