-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
వర్షాలు వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో పాలేరు వరద వల్ల నష్టపోయిన గ్రామస్తులను తాతయ్య రెండు గంటల సేపు పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు.
గ్రామంలో వరద వల్ల పూర్తిగా నష్టపోయిన గృహాలు, పంట పొలాలు, రహదారులు వంటి వాటికీ ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కట్టుట్టలతో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చే రెండు రహదారులు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో వెను వెంటనే మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
వరదలు వల్ల గ్రామానికి గడిచిన వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయా శాఖ వారిని వెంటనే విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,గడ్డం హుస్సేన్ (ఏసుబాబు), శీలం లక్ష్మయ్య, మైలా రమణ రెడ్డి, బాలాజీ, సోమ్లా నాయక్, బుజ్జి బాబు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.