– పట్టాలపై పరిగెత్తేవి కేవలం రైళ్లు కాదు… అవి పట్టణాల అభివృద్ధికి రెక్కలు!
దక్షిణ భారతదేశంలో, తనకు రాజధాని, మెట్రో రైలు లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్‌కి ఓ చిరకాల వేదన. దక్షిణాన పొరుగు రాష్ట్రాలు తమ రాజధానులలో మెట్రో రైళ్ల చకచకా ప్రయాణాలతో ముందుకెళ్తుంటే, “మనకెప్పుడో?” అనే ప్రశ్నతో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.
బెంగళూరులో నమ్మ మెట్రో (‘ನಮ್ಮ ಮೆಟ್ರೋ) ప్రజల జీవనశైలిలో భాగమైపోయింది.
చెన్నై రద్దీని చీల్చే ఆయుధంగా మెట్రోను మలచుకుంది.
హైదరాబాద్ మెట్రో దేశానికే ఆదర్శంగా నిలిచింది.
కొచ్చి మెట్రోతో రవాణా విప్లవాన్ని చూసింది.
అవన్నీ చూస్తూ.. మనకెప్పుడా అని ఎదురు చూశాం.
ఇంతలో… అమరావతిని నిర్మాణ దశలోనే చంపడానికి జరిగిన యత్నాలు, అటు విశాఖ ఇటు విజయవాడ రెండూ పడ్డ కష్టాలు మామూలుగా లేదు, ఆంధ్రప్రదేశ్‌కి మెట్రో ప్రయాణం అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు… మళ్లీ చంద్రబాబు రాకతో ఆ నిరీక్షణకు తెరపడింది!
ఒకేసారి రెండు మెట్రోలు!
అవధులు లేని ఆంధ్రుల ఆనందం.
ఇతర రాష్ట్రాలు ఒక్కో నగరంలో మెట్రో విస్తరణ ప్రణాళికలు వేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం సాహసోపేతంగా, విభిన్నంగా ముందడుగు వేసింది. నేడు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలకు మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం ఒకేసారి టెండర్లు ఆహ్వానించడం ఒక చారిత్రక ఘట్టం! ఇది కేవలం రవాణా సౌకర్యం కాదు… దశాబ్దాల కలలు నిజం అవుతున్న క్షణం.
విజయవాడ మెట్రో – ₹10,118 కోట్లు
విశాఖ మెట్రో – ₹11,498 కోట్లు
మొత్తం ₹21,616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, VMRDA, CRDA, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు కదలనున్నాయి.
పట్టాలపై పరిగెత్తేవి కేవలం రైళ్లు కాదు… అవి పట్టణాల అభివృద్ధికి రెక్కలు!
కేవలం రవాణా మార్గాలు కాదు – ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రయాణ సమయం ఆదా, పర్యాటకులు పెరుగుతారు, ప్రజల జీవితాల్లో ఆనందం.
ఈ మెట్రో ప్రాజెక్టులు ఆర్థిక ప్రగతికి, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాలు ఆధునిక మహానగరాలుగా మారే మార్గంలో ఇది ఒక సమున్నత అడుగు.
చిరకాల స్వప్నం… ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. ఈ క్షణం కోసం మనమందరం ఎదురుచూశాం, కాదా?