Suryaa.co.in

Andhra Pradesh

ఆర్దిక నేరస్దుడికి అంబేద్కర్ తో పోలికా ?

– అంబేద్కర్ ఆశయాలకు అసలైన వారసులు ఎన్టీఆర్, చంద్రబాబు
– జగన్ రెడ్డి పాలనలో అడుగడుగునా అంబేద్కర్ రాజ్యాంగానికి, అంబేద్కర్ కి అవమానం
– దళితులు దళపతులుగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
– టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆశయాలు, సిద్దాంతాలకనుగుణంగా పాలన సాగిస్తే జగన్ రెడ్డి మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ఆయన సిద్దాంతాల్ని తుంగలో తొక్కి ఓ వైపు వ్వవస్ధల్ని నాశనం చేస్తూ, మరో వైపు ‎దళితుల జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ నేతలు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సంధర్బంగా…. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…..
డాక్టర్. బీ.ఆర్.అంబేద్కర్.అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకపోయిఉంటే, మనం మనుషులుగా బతకడానికి అవకాశమే ఉండేదికాదు. అంబేద్కర్ ఏ ఒక్కవర్గానికో, దళితులకో నాయకుడుకాదు… దేశంలోని ప్రజలందరూ కొలవాల్సిన మానవతామూర్తి.ప్రజలందరికోసం పటిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారు. ఆసమయంలోనే ఆయన “రాజ్యాంగం ఎంతమంచిదైనా సరే.. దాన్నిఅమలుచేసేవ్యక్తి మంచివాడుకాకుంటే దానికి విలువలేదు” అన్నారు.

రాజ్యాంగంలో ఏవైనా చిన్నచిన్న తప్పులున్నా, దాన్ని అమలుచేసేవ్యక్తి సమర్థుడైతే పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లుఅయినా ఇప్పటికీ సమాజంలో వివక్షత ఉండటం బాధాకరం. జగన్మోహన్ రెడ్డి మాటలుచెప్పినంత గట్టిగా, రాష్ట్రంలోసామాజిక న్యాయాన్ని అమలుచేయడంలేదు.టీడీపీలో దళితులు, బీసీలకు జరిగిన సామాజికన్యాయం దేశంలో, ఏపార్టీకూడా ఇప్పటికీ అమలుచేయలేదని గట్టిగాచెప్పగలను.

దేశానికి రాష్ట్రపతిగా కే.ఆర్.నారాయణన్, లోక్ సభ స్పీకర్ గా జీ.ఎంసీ.బాలయోగి, ఏపీస్పీకర్ గా ప్రతిభాభారతి పనిచేయడానికి చంద్రబాబే కీలకభూమిక పోషించారు. బీసీలను మంత్రుల్నిచేశామంటూ, వారినోళ్లకు ప్లాస్టర్లు వేయడం ఎలాంటి సామాజికన్యాయమని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో గతఐదేళ్లలో చంద్రబాబుగారి ప్రభుత్వంలో దళితులు, బీసీలకు చేసిన సంక్షేమం.. దేశంలో ఏప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. బీసీలు, దళితులు చంద్రబాబుపాలనలో తమకుజరిగిన మేలు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా చైతన్యవంతులుకాకుంటే తీవ్రంగా నష్టపోతారు.

చంద్రబాబునాయుడు దళితవిద్యార్థుల్ని విదేశాల్లో చదివిస్తే, దాన్ని కొనసాగించకకుండా జగన్మోహన్ రెడ్డి, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల్ని రోడ్లపాలు చేశాడు.బీసీలు, దళితులకు అన్యాయంజరిగితే, వారిని వాడుకునేవారిని చొక్కాపట్టుకొని నిలదీసే హక్కు రాజ్యాంగం మనకుకల్పించింది.తమతమ వర్గాలకుఅన్యాయం చేస్తున్నారని అధికారపార్టీలోని ఏ దళిత, బీసీ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డిని నిలదీయగలడా? రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై తనపార్టీవారితో ముఖ్యమంత్రిఏనాడైనా చర్చించాడా? తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని ఉత్తుత్తిసమీక్షలుచేయడం తప్ప, ఏవర్గానికైనా న్యాయంచేశాడా? జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కార్పొరేషన్లు అడ్రస్ లేని విభాగాలుగా మారాయి.

నిత్యావసరాలు..ధరలపెంపుతోపాటు, ఛార్జీలు, పన్నులభారంతో దళితులు,బీసీలనే జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు. జగజ్జీవన్ రామ్ పేరుతో చంద్రబాబుగారు దళితులకు 200యూనిట్లవరకు ఉచిత విద్యుత్ అందించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దళితులు, అగ్రవర్ణాలని లేకుండా అందరిపై విద్యుత్ ఛార్జీలభారం మోపాడు.

జగన్ జమానాలో దళితులు, బీసీలపై జరిగిన దాడులు మాటల్లోచెప్పలేనివి…. వాటిగురించి పెద్ద బుక్ లెట్ వేయొచ్చు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలన్నా…. దళితులు, బీసీలు, మైనారిటీలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. అందరం సంఘటితమైతేనే అన్నివర్గాలకు న్యాయంచేయగలుగుతాం. మీరు ఇచ్చే సలహాలు, సూచనలను వచ్చేఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోపెట్టి, దళితులు, బీసీలకున్యాయంచేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…
మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వాల్సేందేనన్న తొలి వ్యక్తి మన అంబేద్కర్. దళితుడు ప్రధాని ఎలా అవుతాడని బాబూ జగ్జీవన్ రామ్ ను అడ్డుకున్నారు. కుగ్రామంలో పుట్టిన దళితుడిని లోక్ సభ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుది. దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుది. ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన నేరస్తుడి పిలుపు విని ఓట్లు వేయడంలో అర్ధముందా. ? దళిత ఓట్లతో గెలిచి దళితులపై దాడులు చేయడం దుర్మార్గం. దళితుల్ని గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశమే. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి దళితుల్ని లిప్టులోకి ఎక్కనివ్వలేదు. పార్టీ నిర్ణయాల్లో దళితులకు చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యం ఏ పార్టీలోనూ లేదు. అంటరాని తనాన్న పాటించే జగన్ కు.. దళితుల్ని అక్కున చేర్చుకునే చంద్రబాబుతో పోలికా.?

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ…
అంబేద్కర్ అంటే.. ఈ దేశంలో స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత పరిస్థితులకు నిదర్శనం, ప్రజల హక్కులకు అక్షర రూపం అంబేద్కర్. కుల మత వర్గ సమ్మేళనమైన దేశాన్ని అంబేద్కర్ ముందుండి నడిపించారు. దళితులు ఈ రోజు సాధించుకున్న స్వాతంత్ర్యం అంబేద్కర్ చలవే. అంబేద్కర్ కు అత్యంత గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేభారతరత్న బిరుదు, పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ చొరవతోనే. దళితుల సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. అంబేద్కర్ అభినందన సభల్ని బహిస్కరించిన ఘనత వైసీపీది. అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు నిలిపివేయడం దుర్మార్గం. ఆర్ధిక, రాజకీయ, సామాజిక సమానత్వం కల్పించడంలో జగన్ విఫలం. 27కి పైగా దళిత పథకాలు రద్దు చేయడం దుర్మార్గం. రాజ్యాంగపరంగా వచ్చే హక్కుల్ని కూడా హరించడం హేయం. భవిష్యత్తులో దళితులంతా ఏకమై.. జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడం తధ్యం.

మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ…
అంబేద్కర్ చిన్నతనంలో తీవ్రమైన కుల వివక్షతను ఎదుర్కొన్నారు.అంబేద్కర్ అంటే విద్యా, విజ్ఞాన గని. ఒక్క దళితులకే కాదు అన్ని కులాల వారికీ అంబేద్కర్ ఆరాధ్య దైవం. మహిళలు, పురుషులతో పాటు సమానమైన అవకాశాల కోపం ఆయన తపించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల్లో సాధికారతకు పాటుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుదాం.

మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ…
భరతమాత మనకు ప్రసాదించిన అరుదైన ఆణిముత్యాల్లో ఒకరు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారు.పీడిత, తాడిత, బడుగుబలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతస్థానాల్లో ఉండాలని ఆలోచించిన గొప్పమహానుభావుడు. అంబేద్కర్ రచించిన భారతరాజ్యాంగం రామబాణంకంటే, సుదర్శనచక్రంకంటే, పాశుపతాస్త్రం కంటే అత్యంత శక్తివంతమైనది. అన్నివర్గాలప్రజలకు వారివారి మతగ్రంథాలకంటే గొప్పగ్రంథం అంబేద్కర్ విరచిత భారతరాజ్యాంగం.అంటరానితనం జాడ్యానికి గురైన అంబేద్కర్ దాన్నిరూపుమాపడానికి తనజీవితాంతం కృషిచేశారు. ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్.. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి. నక్కకు, నాగలోకానికి, భూమికి ఆశాకానికి ఉన్నంత తేడా వారిరువురిమధ్యన ఉంది.జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితులు, బీసీల పక్షపాతే అయితే ముఖ్యమంత్రి పదవినితక్షణమే ఆయావర్గాలవారికి కట్టబెట్టాలి. జగన్ ప్రభుత్వంలో, కేబినెట్లో ఎక్కడైనా మచ్చుకైనా సామాజికన్యాయం ఉందా? జగన్ కేబినెట్లో ఉన్న మంత్రులెవరో సరిగ్గా ప్రజలకు తెలుసా? స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ స్థాపించాకనే రాష్ట్రంలో కుల,మత,వర్గ, వర్ణ,వివక్ష తొలగిపోయింది.

మాజీ మంత్రి పరసా రత్నం మాట్లుడుతూ…
దేశానికి ఆదర్శవంతమై రాజ్యాంగాన్నిచ్చిన అంబేద్కర్ చిరస్మరణీయుడు. దళితులకు అగ్రాసనం వేసింది తెలుగుదేశం పార్టీయే. డుగు బలహీన వర్గాల అభ్యున్నతే అంబేద్కర్ ఆశయం. దళితుల అభ్యున్నతి కోసం టీడీపీ సేవలు ఆదర్శప్రాయం. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. దళితుల్ని అవమానిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ దమనకాండకు వందల మంది దళితులు దహనమయ్యారు. దళితులు పిడికిలి బిగిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసుకో. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవస్థలు తప్ప ఏమీ లేదు. అమరావతిలో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులోనూ జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. జగన్ రెడ్డీ.. దళితుల తడాఖా రేపు ఎన్నికల్లో చూస్తావ్.

ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ…
దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ చలువే .అంబేద్కర్ రిజర్వేషన్ల ఫలాల వల్లే నేను డాక్టర్, ఎమ్మెల్యే అయ్యా . అంబేద్కర్ ఆశయ సాధనకు దళితులుంతా నడుం బిగించాలి. దళితులకు మేనమామ అని చెప్పిన జగన్ రెడ్డి అదే దళితులకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. ఎన్టీఆర్ గురుకుల పారశాలలు ఏర్పాటు చేస్తే…ఆ పాఠశాలల్లో జగన్ రెడ్డి 4 వేల సీట్లు రద్దు చేశారు. సలహాదారు పదవులు సమర్దులకే ఇస్తామని జగన్ రెడ్డి అనటం అహంకారానికి నిదర్శనం. చదళితుల్లో సమర్ధవంతులు లేరా? ఇది యావత్ దళిత జాతిని అవమానించటమే. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, విదీశీ విద్యను రద్దు చేసి దళితులకు ద్రోహం చేశారు. దళితుల్నిమోసం చేసిన జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు దళితులంతా సిద్దంగా ఉన్నారు . ఎన్టీఆర్ చంద్రబాబు అంబేద్కర్ ఆశయాల కోసం పని చేశారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేది టీడీపీ మాత్రమే.

ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ…
దళితులు దళపతులయ్యేరోజు దగ్గర్లోనే ఉంది. అంబేద్కర్ మహానుభావుడి గురించిచెప్పాలంటే రోజులైనా సరిపోవు.
అంబేద్కర్ లాంటి గొప్పవ్యక్తి, అపరమేథావిని కేవలం దళితులనాయకుడిగా మాత్రమే చిత్రీకరించే చర్యలకుపాల్పడటం బాధాకరం.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా, కూలంకషంగా చదవాలంటే ఎవరికీ అంతతేలిగ్గా సాధ్యమయ్యేపనికాదు.అలాంటి రాజ్యాంగాన్ని ఒంటిచేత్తోరాసిన గొప్పవ్యక్తి అంబేద్కర్ మహానుభావుడు.
జగన్మోహన్ రెడ్డిలాంటి కుహానా రాజకీయవాదిని అంబేద్కర్ తో పోల్చడాన్ని తీవ్రంగావ్యతిరేకిస్తున్నాను. రాజ్యాంగంవల్ల భారతదేశానికి, దేశపౌరులకు లభించే రక్షణ, ప్రయోజనాలేంటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.అంబేద్కర్, జ్యోతిరావుపూలేల ఆలోచనలు, ఆశయాలు ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించాలనుకుంటున్నాం.

మాజీ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ….
తనకు ఎదురైన అవమానాలు భవిష్యత్ తరాలకు రాకూడదని అంబేద్కర్ భావించారు.అంబేద్కర్ దళితుల కోసమే కాదు బడుగు, బలహీన వర్గాలు , స్త్రీల హక్కుల కోసమూ పోరాడారు.దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను ప్రయోగిస్తున్న దుర్మార్గపు పార్టీ వైసీపీ. మూడేళ్లుగా దళితలను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దళితులపై ఎందుకంత చిన్నచూపు? జగన్ రెడ్డికి అంబేద్కర్ తో పోలికా? 11,500 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడమేనా సామాజిక న్యాయం? దళితుల కోసం పెట్టిన 27 పథకాలను రద్దు చేయడం దుర్మార్గం. సామాజిక న్యాయమంటే ఎలా ఉంటుందో చూపించింది తెలుగుదేశం. పార్టీ ఆవిర్బావం నుంచి పేదల కోసమే పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం.

టీడీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ…
అంబేద్కర్ ఈ దేశంలో జన్మించి ఉండకపోతే అణగారిన వర్గాల ప్రజల్ని ఇంకా మనుషులుగా చూసే వారు కాదేమో. అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు . అణగారిన వర్గాల వారు నేడు అత్యున్నత పదవుల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ బిక్షే. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ఆశయాలతో ఏర్పాటైన పార్టీ టీడీపీ. పటేల్, పట్వారీ, కరణం, మునుసుబు వ్యవస్ధలను రద్దు చేసి ధళితులు, బీసీలకు స్వేచ్చ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. వైసీపీ నేతలు ఆర్దిక నేరగాడైన జగన్ ని అంబేద్కర్ పోలుస్తూ ఆయన్ని ‎ అవమానిస్తే తోలు తీస్తాం. సామాజిక న్యాయం అంటే జగన్ రెడ్డి తన సొంత సామాజికవర్గానికి క్యాబినెట్ పదవులివ్వటమా?నిధులు, విధులు లేని కార్పోరేషన్ల దళితులు, బీసీలకు ఒరిగేదేంటి? సామాజిక న్యాయం ఒక్క టీడీపీతోనే సాధ్యం

టీడీపీ హెచ్ ఆర్ డీ ఛైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ…
భారతదేశంలో పుట్టి, ఆయనపేరుని వాడుకుంటున్న ప్రతి వ్యక్తి అంబేద్కర్ ను గుండెల్లో దాచుకోవాల్సిందే.అంబేద్కర్ భావజాలంతో ముందుకుసాగుతున్నవారంతా, ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నవారిపై పోరాడాల్సిందే.గ్రామసర్పంచ్ మొదలు, భారతప్రధాని వరకు అందరూ అంబేద్కర్ రాజ్యాంగంవల్లే ఆయాపదవుల్లో ఉన్నారని గుర్తించాలి.
అంబేద్కర్ కేవలం ఒకసమాజానికి, కొన్నివర్గాలకే పరిమితమని సంకుచితంగా ఆలోచిస్తున్న పెద్దమనుషులుంతా ఆలోచించుకోవాలి. అన్నికులాల్లో అణచివేయబడుతున్నవారందరికీ రాజ్యాంగఫలాలు అందించడకోసం వ్యవస్థలపై దండయాత్ర చేసిన గొప్పవ్యక్తి అంబేద్కర్ మహానుభావుడు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు పేదలంతా రాగులు, జొన్నలు, సజ్జలవంటి ముతకధాన్యంమాత్రమే తినేవారు. అంబేద్కర్ భావజాలాన్ని గుండెలనిండా నింపుకున్న అన్నఎన్టీఆర్ పేదలందరికీ వరిఅన్నంపెట్టడమేకాకుండా పక్కాఇళ్లునిర్మించి ఇచ్చారు.
హిందూకోడ్ బిల్లుతో మహిళలకు అంబేద్కర్ విద్యాహక్కుకల్పిస్తే, అన్నఎన్టీఆర్ గారు వారికి ఆస్తిహక్కు కల్పించారు.చంద్రబాబునాయడు ఆస్తిహక్కుతోపాటు డ్వాక్రాసంఘాలతో మహిళల్ని ఆర్థికవేత్తలుగా మార్చారు.దళితులకు రూ.10లక్షలతో విదేశీవిద్యపథకాన్ని చంద్రబాబు అమలుచేశారు. ఆయన పుణ్యంవల్లనే ఏనాడు విమానంఎక్కని 4లక్షలమంది విదేశాల్లో చదువుకుంటున్నారు.
అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడమంటే ఎన్టీఆర్ లా, చంద్రబాబులా పేదలకు మేలుచేయడమే.ఈ ప్రభుత్వం వచ్చాక దళితులకు సంబంధించిన 27పథకాలను తొలగించింది. అంబేద్కర్ భావజాలమనేది ఈప్రభుత్వంలో వెనక్కువెళుతున్న సందర్భంలో దాన్ని ముందుకునడపడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా వైసిపి మూడేళ్ళ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు అత్యాచారాలపై దళితులపై దమనకాండ దళిత ద్రోహి జగన్ రెడ్డి అనే పుస్తకాన్ని టిడిపి నేతలు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ‎బూర్ల రామాంజనేయులు,‎ ‎మద్దిరాల మ్యాని, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు రైతు రాష్ట్ర అద్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE