Home » మనసున మనసై.. ఆ మనసుకే గాయమైన డాక్టర్!

మనసున మనసై.. ఆ మనసుకే గాయమైన డాక్టర్!

డాక్టర్ చక్రవర్తి అక్కినేని..
మాధవి సావిత్రి..
రవీంద్ర జగ్గయ్య..
శేఖర్ గుమ్మడి..
డాక్టర్ శ్రీదేవి కృష్ణకుమారి..
సుధ గీతాంజలి..
నిర్మల జానకి..
ఇంతమంది హేమాహేమీలున్నా..
హిట్టుపై హామీలున్నా..
ఇందర్ని నడిపే సమవర్తి..
ఆదుర్తి..
ఆయన దర్శకత్వ
పటిమతోనే
హిట్టయింది డాక్టర్ చక్రవర్తి!

అనుమానానికి,అనురాగానికి
మధ్య జరిగే
భావోద్వేగాల రణం..
చక్రభ్రమణం..
కౌసల్యాదేవి విరచిత నవల
అన్నపూర్ణ వారి
వెండి తెర వెన్నెల..
పసందైన పాటల మాల..!

త్యాగాలు..అక్కినేని నటజీవితాన సరాగాలు..
వైద్యుడు..కళారాధ్యుడు..
ఈ మౌనం..ఈ బిడియం అంటూనే చెలికి
వియోగమే కానుక..
పాడమని నన్నడగ తగునా
పరవశించి పాడనా..
చెల్లికి అన్నగా
ఇచ్చిన మాట కోసం
ఇష్టం లేని మనువు..
దేవుడిచ్చిన చెల్లితో బంధం
ఎవరో జ్వాలలు రగిలించగా
వేరెవరో దానికి బలి
అయిన వైనం..
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడు కోసం
పరితపించిన భావుకుడు..
అద్భుత గాయకుడు
మన నాయకుడు!
కలతల నడుమ కళ తప్పిన
సంసారాలు..
సమపాళ్లలో పండిన నవరసాలు..
అక్కినేని నటజీవితంలో
మరో మైలురాయి..
ఎప్పటిలా సావిత్రి కలికితురాయి..!

ఇంగితం ఎరిగిన
రసాలూరు సంగీతం..
ప్రాణం పోసిన
మాస్టారి పాటలు…
సూర్యకాంతం..పద్మనాభం..
చలం..జయంతి..
పండిన హాస్యం..
భోజనప్రియుడు
జగ్గయ్య ఫాదర్..
అందరూ టగెదర్..
ఆదుర్తి కీర్తికిరీటంలో
మరో చక్కని ఫెదర్..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply