-జనసేన పిఏసి ఛైర్మెన్ నాదెళ్ల మనోహర్
అధికార దుర్వినియోగానికి ఈ సభలు పరాకాష్ట. అద్భుతంగా ఏర్పాట్లు చేశామని చెప్పి… జనాలను తరలించారు. ఒకరు సింహాలు, మరొకరు పులులు అంటారు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ సమాజానికి శ్రేయస్కరం కాదు. పెద్ద గుడారాలు వేసి సర్కస్ నిర్వహించిన విధంగా ఉంది. జగన్ గతంలో మీరు ఏం మాట్లాడారు, శాసనసభ లో ఏం చెప్పారో అందరికీ గుర్తు ఉంది. పార్టీ ప్రణాళిక, సిద్దాంతం ఒక వ్యక్తి చుట్టే తిరుగుతుంది. జగన్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉంది. ఆ వేదిక ద్వారా గడపగడపకూ విజయ వంతం చేయాలని జగన్ బతిమాలుకుంటున్నాడు. అసలు ఆ సభలో పద్దతిగా ఎంతమంది మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులుపై బూతులతో నోరు పారేసుకోవడానికి అంత ఖర్చు పెట్టారా?
రైతు భరోసా, అక్కమ్మ లకు, చెల్లెమ్మలకు డబ్బులు వేశామని అబద్ధం చెప్పారు. ఎంతమందికి కోత పెట్టి… కన్నీరు పెట్టించారు. అమలాపురం ఘటనలలో జగన్ నేటికీ స్పందించ లేదు. కులాల కుంపట్లు, మతాల మధ్య విద్వేషాలు పెట్టడమే జగన్ నైజం. పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ప్రభుత్వం తీరును తప్పు బట్టారు. అమాయకులైన యువకులపై అన్యాయంగా కేసులు పెట్టారు. నిజంగా మ్యానిఫెస్టో ను పూర్తిగా అమలు చేశారా? అసలు ఎన్నిసార్లు మీరు మీ ప్యాలెస్ నుంచి బయటికొచ్చారు.మీరు నిజంగా 95 శాతం హామీలు అమలు చేశారా.నిజమైతె ఏప్రిల్ లో ఎన్నికలకు రండి తేల్చుకుందాం. ఢిల్లీ వెళ్లి ముందస్తు ఎన్నికలు కోరారు కదా. సిఎం హోదాలో మీరు మాట్లాడిన భాష కరెక్టేనా.
మీ సొంత నియోజకవర్గం పులివెందులలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ప్రజాభిమానం ఉంటే అన్ని బారికేడ్లు, అంతమంది పోలీసులు ఎందుకు.మేక పోతు గాంభీర్యంతో జగన్ ప్రసంగం సాగింది. ఇన్ని అప్పులు ఎందుకు చేశారు, అభివృద్ధి ఎందుకు జరగలేదో చెప్పాలి. 95 శాతం హామీలు పూర్తి అయితే… ఇన్ని పనులు ఎలా ఆగిపోయాయి. జనసేన జనవాణిలో వందలాదిగా ఫిర్యాదులు వచ్చాయి. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ అండ్ కో ప్రసంగాలు విని నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఎందుకు రేషన్ కార్డు లు తొలగించారు. నిజాయితీ లేని జగనా… క్యాలిబర్, కేపాసిటీ గురించి మాట్లాడేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. జనసేన చేస్తున్న సాయం చూసి మీరు తటదటుకోలేక పోతున్నారు. పవన్ సొంత డబ్బుతో అదుకుంటే ఇలా విమర్శలు చేస్తారా.
151సీట్లు ఇచ్చి అధికారం అప్పగించినా మీకుచేత కాలేదు. సొంత మీడియా లొ అన్నీ అసత్య కధనాలతో మాయ చేస్తున్నారు. మి ప్లీనరీ సర్కస్ కంపెనీ సమావేశం లాగానే ఉంది. వ్యక్తిగత విమర్శలు, పిచ్చుమాటలకే ప్లీనరీనా. ఏదో కావాలని మాట్లాడటం తప్ప… అది నిజం కాదని మీకు తెలియదా. జగన్ ఇప్పుడు అయినా ఆత్మ విమర్శ చేసుకోవాలి. కోనసీమ కు అంబేద్కర్ జిల్లా పెడితే పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అంతగొడవ జరిగినా కనీసం స్పందించని జగన్ .. నేడు అబద్దాలు ప్రచారం చేశారు. రేపు రెండోవిడత జనసేన జనవాణి విజయవాడ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. తమ ఇబ్బందులు ను ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టి కి తీసుకు రావాలి. జగన్ మాటల్లో నిజాయితీ ఉంటే.. గడపగడపకు ఎందుకు విజయవంతం కావడం లేదు. ప్రభుత్వం తరపున ముందు వాళ్లు సమాధానం చెప్పాలి. ప్రతి ఇంటికీ లబ్ది జరిగితే వైసిపి నాయకులను ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు. ఎంతోమంది పేదలకు పధకాలు రద్దు చేసి, వారి కడుపు కొట్టారు. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు… ఇప్పుడు అమలు తీరుపై జగన్ సమాధానం చెప్పాలి.