రాష్ట్ర విభజన చట్టానికి 11 సంవత్సరాలు పూర్తయినా కీలకమైన దుగ్గరాజుపట్నం, విశాఖ, విజయవాడ మెట్రోరైల్ లు కనీసం కాగితాలలో కూడా అడుగు ముందుకు పడకపోగా.. రెండడుగులు ముందుకు- నాలుగు అడుగులు వెనక్కి చందాన వుంది.
రాష్ట్రం విభజన చట్టం షెడ్యూలు 13లో పెట్టిన విద్యా సంస్థలు కొన్ని పూర్తయి, రెవిన్యూ లోటు, చిన్నాచితక తప్ప మిగతావి నత్తనడకన నడస్తున్నాయి.
ఆర్టీఐ కింద కేంద్ర ప్రభుత్వాన్ని పోర్టు మంజూరు, మెట్రోలపై కేంద్ర ప్రభుత్వాన్ని అవి ఏ దశలో వుంది తదితర తాజాగా వివరాలు కోరగా ఈ క్రింది విధంగా తెలిపారు.
వాస్తవానికి 13వ షెడ్యూల్‌లో కొన్ని మాత్రమే తప్పని సరిగా ఏర్పాటు చేయాలి. లేదా మంజూరు చేయాలని చట్టం రూపొందించారు. వాటిలో మౌళిక సదుపాయాల క్రింద కేంద్ర ప్రభుత్వం ఒక మేజర్ పోర్టును దశల వారీగా, దుగ్గరాజుపట్నంలో నిర్మించాలని.. మొదట దశ 2018 నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. అంటే దాదాపు 5,6 వేల కోట్లుతో కేంద్రం నిర్మించి ఉండాలి.
తొలుత నీతిఆయోగ్ దుగ్గరాజుపట్నం సమీపంలోని క్రిష్ణపట్నం, ఎన్నురు, చెన్నై పోర్టులు 40,80 కిమీ దూరంలో ఉన్నాయని, వాటిల్లో ప్రస్తుతం 65% సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయని.. దుగ్గరాజుపట్నంలో ఏర్పాటు చేస్తే, ఆ పోర్టులపై యార్ట్‌వర్స్ ఇంప్యాక్ట్ వుంటుందని అడ్డుకుంది.
ఆ తర్వాత జగన్ ప్రభుత్వం.. రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మిస్తామని దానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. కాని రాష్ట్ర ప్రభుత్వం 20/02/2020 ఇచ్చిన నోటిఫికేషన్‌లో రామాయపట్నంను నాన్ మేజర్ పోర్టుగా ప్రకటించింది కాబట్టి ఏపిఆర్‌ఏ 2014లో ప్రకారం మేజర్ పోర్టుకు మాత్రమే సహాయం చేయాలి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రం పక్కన పెట్టింది.
దుగ్గరాజుపట్నంలో నిర్మాణం నాన్ ఫీజుబులిటీ అని రామాయపట్నానికి నిధులు ఇవ్వాలంటే.. ఏపిఆర్‌ఏ 2014కి చట్ట సవరణ చేయాలని స్పష్టం చేసింది.దీనిపై గత 6 సంవత్సరాల నుండి రాష్ట్రం స్పందించలేదని కేంద్రం తెలిపింది.
ఆతర్వాత 2021 నుండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని పోర్టులు, షిఫింగ్ శాఖను రూ. 4992 కోట్లు కావాలని పదే పదే కోరిందని కానీ నాన్ మేజర్ పోర్టుగా రామాయపట్నంను మార్చాలని ఒత్తిడి చేయవద్దని 2022 నుండి 2024 వరకు కోరిందని తెలిపింది.
చివరకు ఫిబ్రవరి 2024లో రూ. 4992 వేల కోట్లు మంజూరు ప్రతిపాదనను కేంద్ర వ్యయ మంత్రిత్వశాఖకు పంపారు. కానీ ఆర్థికశాఖ నుండి నేటి వరకు జవాబు రాలేదని తెలిపింది.
తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక 24`07`2024న విభజన హామీలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో దుగ్గరాజుపట్నం పై చర్చించారని తెలిపారు.దాని ప్రకారం అక్టోబర్ 2024లో దుగ్గరాజుపట్నంలో షిప్ బిల్డింగ్ కమ్ రిపేర్/ పోర్టును ఏర్పాటు చేయటానికి టెక్నికల్ ఎకనామిక్ ఫీజుబులిటీ రిపోర్టును 3 నెలల్లో సమర్పించాలని కేంద్ర పోర్టులు, షిఫింగ్ మంత్రిశాఖ ఆదేశించిందని తెలిపింది.
ఏతావాతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బంతాట. ప్రైవేటు పోర్టుల లాభం కోసం దుగ్గరాజుపట్నం 11 సంవత్సరాలుగా కాగితంలో కూడా మంజూరు చేయలేదు.
ఇక విశాఖ, విజయవాడ మెట్రోలు 2017 మెట్రో పాలసీ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే నిధుల ప్రణాళిక, కాంప్రెహెన్సివ్ మెబిలిటీ ప్లాన్, ప్రత్నామయ నివేదన మరియు డిపిఆర్‌లు చేసుకొవాలని స్పష్టం చేసింది.
విశాఖపట్నానికి 76.90 కిమీల రైలు మార్గంతో జనవరి 2024 ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని అలాగే విజయవాడలో మెట్రో రైల్ కారిడార్ 38.90 కిమీ నిర్మించడానికి డిశంబర్ 2024లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పట్టణాభివృద్ది వ్యవహరాలు మంత్రిత్వశాఖ తెలిపింది.
రెండు ప్రతిపాదనలు తాము పరిశీలించామని కాని రెండు ప్రాజెక్టులు 5 సంవత్సరాల క్రితం తయారుచేశారని ముదింపు నిభందనల ప్రకారం వీటిని స్టడీ చేసి కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లాన్ ( సిఎమ్‌పి) పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఇప్పటివరకు అవసరమైన డాక్యుమెంట్లు రాష్ట్రం పంపలేదని ఆర్టీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదని తెలిపింది.
మరో వైపు ఏపి మెట్రో రైల్ కార్పోరేషన్ విజయవాడ మెట్రోను రూ. 11009 వేల కోట్లతో ఖరారు దశలో వుందని, డిపిఆర్‌ను బహిరంగ పర్చలేమని.. అందుకు కారణం ఇది కేంద్ర వద్ద పరిశీలనలో వుందని ఆర్టీఐ కింద తెలిపింది.
10 సంవత్సరాలలో మెట్రో కార్పోరేషన్‌కు రాష్ట్రం, కేంద్రం రూ.18.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది.
– ఇనగంటి రవికుమార్
(సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ యాక్టివిస్ట్)
9440053047