– ‘వారధి’లో సర్పంచ్ ఆవేదన
విజయవాడ: కేంద్ర మంత్రి సభకు ప్రొటోకాల్ ఖర్చు లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వారధి కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాయనపాడు గ్రామ సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
గొల్లపూడి మండలం, రాయనపాడు గ్రామంలో గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు మౌఖిక ఆదేశాలు మేరకు రూ.4.23 వేలు అప్పు చేసి ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదని ఫిర్యాదు చేయగా వెంటనే పురందేశ్వరి ప్రస్తుత కలెక్టర్ తో ఫోన్ చేసి స్పెషల్ కేసు గా పరిగణించాలని కోరారు.
దీనికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. ఈ విధంగా వారధి లో వచ్చి న ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, పార్టీ అధికార ప్రతినిధి యామినీ శర్మ, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్, తదితరులు పాల్గొన్నారు.