– ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపింది
లోకేష్ ను కలిసిన మదనపల్లి విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ప్రతినిధులు
జేఏసీ వినతిపత్రంలో అంశాలు…
• మదనపల్లి విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మదనపల్లిలో 1915లో స్థాపితమైన బిటి కళాశాల ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది.
• బిటి కళాశాలలో విద్యనభ్యసించిన వారు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులుగా ఎదిగారు.
• మద్రాసు బీసెంట్ ట్రస్ట్ కింద పనిచేసిన ఈ కళాశాలను గత ఏడాది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
• గతంలో ఇంటర్, డిగ్రీ, పీజీల్లో అన్ని కోర్సులు ఉండగా, ప్రస్తుతం కొన్ని కోర్సులను మాత్రమే కొనసాగిస్తున్నారు.
• కళాశాలలోని బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను మూసివేశారు.
• ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 7నెలలు కావస్తున్నా ఇప్పటివరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీచేయలేదు.
• ఇప్పటికే ఉన్న సిబ్బందికి జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు.
• ఫుల్ టైమ్ ప్రిన్సిపాల్ ను నియమించకుండా ఇన్చార్జితో నామమాత్రంగా నడిపిస్తున్నారు.
• బిసిటి ట్రస్ట్ కింద ఉన్న ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రత్యేక యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలి.
• ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందన…
• రాష్ట్రంలోని వేల కోట్ల రూపాయల ప్రముఖ ట్రస్టులు, ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపింది.
• రాష్ట్రవ్యాప్తంగా ఎంతో నాణ్యమైన విద్యనంచిన క్రిస్టియన్, మైనారిటీ ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకొని పేదలకు విద్యను దూరం చేస్తోంది.
• జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు విద్యాసంస్థలు సైతం బలిపశువులుగా మారాయి.
• ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేశారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తాం.
• ఆయా కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందిస్తాం.
• రాయలసీమలోనే పేరెన్నికగన్న మదనపల్లి బిటి కళాశాలకు గత వైభవాన్ని తీసుకువస్తాం.