ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు

– మోడీ ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా?
– విజయ సంకల్ప యాత్రలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్… ఈస్ గాం, గ్రామంలో బెంగాలీ సామజ్ & వేద మందిర్ సమాజంతో సమావేశం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సిర్పూర్ కాగజ్ నగర్ : ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు జరుగుతాయి. సమర్ద నాయకుడు నరేంద్ర మోడి ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా? ప్రజలు తెల్చుకోవాలి. మంచి ఎవరూ చేస్తున్నారో చూసి ఓటు వేయాలి. 2014 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైన అవీనితి జరిగిందా? కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవీనితి జరిగింది. ఏ పేపర్ ఏ టీవీ పేపర్ చూసిన వారి అవీనితి గురించి ఉంటుంది.

మన్మోహన్ సింగ్ కాబినెట్ లోని మంత్రులు జైలుకు వెళ్ళారు. నరేంద్ర మోడి హాయంలో ఒక్క రూపాయి అవీనితి కూడా జరగలేదు. అవీనితి రహిత సమాజాన్ని మోడి ప్రభుత్వం నిర్మించింది. కాంగ్రెస్ కుటుంబ పార్టీ. మన్మోహన్ రిమోట్ ప్రధాని. సోనియా ఆడిస్తే మన్మోసింగ్ ఆడాడు. మనకు శక్తిశాలి ప్రధాని కావాలి. వచ్చే ఎన్నికల్లో మోడిని ఆశీర్వదించండి.

మోడి వల్ల ప్రపంచం మెుత్తం భారత్ ను కీర్తిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన సైనికులను చంపారు. దేశంలో అనేక మరణహోమాలు సృష్టించారు. మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆట కట్టించారు. జమ్మూ కాశ్మీర్ లో కల్లోలాకు పాకిస్తాన్ కారణం. మోడీ ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను నియంత్రించారు. ఆ దేశానికి తెలియకుండానే పాక్ పై దాడులు చేయించారు.
ఈ రోజు పాకిస్థాన్ ను ఏ దేశం పట్టించుకోవడం లేదు. భారత్ లో మోడి వేగంగా జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. మహిళ సంఘాలకు రుణాలు అందించారు. కేసీఆర్ డబుల్ ఇళ్లను మోసం చేశాడు. దేశంలో 4 కోట్లు ఇండ్లను నిర్మించారు.

కట్టెల పొయ్యితో ఏ మహిళ ఇబ్బంది పడకూడదని ఉజ్వల్ పథకం ద్వారా గ్యాస్ సీలండర్లను అందిస్తున్నారు. ఆదివాసులకు ఇళ్లకు కూడా కరెంట్ అందించారు మోడీ. పేదలకు ఆరోగ్య భీమాను అందించారు. బ్యాంక్ అకౌంట్ లను ఓపెన్ చేయించారు. భవ్య దివ్యమైన అయో ద్య దేవాలయ నిర్మాణాన్ని మోడి నిర్మించారు.

Leave a Reply