Suryaa.co.in

Andhra Pradesh

పేర్ని నాని దొంగ రాజకీయం

– అసైన్ భూముల పేరుతో కొత్త దందా
-బినామీలను సరిచేసుకోవడానికి చీకటి కార్యక్రమం..
-బందరు భూములను బినామీ పేర్లతో దోపిడీ.
-లాండ్ అక్విజేషన్ చట్టం ప్రకారం చేయక పోతే అధికారులు ఇబ్బంది పడుతారు
-తప్పు చేసినట్లు తేలితే జీవిత కాలం నష్ట పోతారు.
-తప్పుడు మనుషులకు కొమ్ముకాస్తే అధికారులకు కష్టాలు తప్పవు
-ఎన్నికల ముందు పేర్ని నాని చేసే తంతు బందరు ప్రజలందరికీ తెలుసు
-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని పేద ప్రజలను ఇళ్ల పట్టాలు భూముల పంపిణీ పేరుతో చేతున్న అవినీతి, అక్రమాల భాగోతంపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

అసైన్మెంట్ల ల్యాండ్ గురించి కలెక్టర్ని ఆర్డీవోని అధికారులని సీఎమ్ఓ అధికారి ధనుంజయ రెడ్డితో బెదిరించాడు. భవిష్యత్తులో మీకు ఇబ్బందులు పడుతారు. రేపు గవర్నమెంట్ వస్తుంది మీరు ఎక్కడ ఉద్యోగం చేయలేరు అని చెప్పి భయపెట్టాడు

చిన్నాపురం భవాని పురం రోడ్డు మూడు రోజుల క్రితం కొబ్బరికాయ కొట్టాడు ఈ దారి గత రెండు సంవత్సరాల కింద ఆగిపోయింది కాంట్రాక్ట్ వాళ్ళకి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టరు ఎప్పుడో పారిపోయాడు. ఇప్పుడు దానికి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి స్థానికంగా సర్పంచుల్ని పిలిపించి కొబ్బరికాయ కొట్టి కాంట్రాక్టర్లును పనిచేయమని బ్రతిమిలాడుతున్నారు.

ఎన్నికల సమీపిస్తుండడంతో అమాయకమైన పేద ప్రజలను మభ్యపెట్టి జగనన్న ఇంటి పట్టా అని మభ్య పెడుతున్నారు. నేషనల్ కాలేజీ దగ్గర పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు ఇవన్నీ దొంగ పట్టాలే.నిజంగా ప్రజలకు నీకు మంచి చేయాలనిపిస్తే ఐదేళ్లుగా మగ్గిపోతున్న జి+3 ఇల్లు ఎందుకు కేటాయించడం లేదు.

ఒకటో డివిజన్లో కొనకల్ల గణపతి పేరు మీద ఉన్న పార్కుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీలక్ష్మి తండ్రి పేరు పార్కుకి పెట్టి ఆమె చేత ఓపెన్ చేపిచ్చి ఆమెను ప్రసన్నం చేసుకొని అడ్డుగోలు అనుమతులు ఇప్పించి మూడ సొమ్మును తన ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు, ఏ రూల్స్ ప్రకారం నిధులు వినియోగిస్తున్నారు.

మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి జగన్ 20 కోట్లు నిధులు ఇచ్చారని ప్రచారం చేస్తున్నాడు. ఆ 20 కోట్లు గత టీడీపీ హయాంలో మినరల్ కార్పొరేషన్ నుండి ముడా తీసుకొచ్చిన లోన్ ఎమౌంట్ లో మిగిలిన 18కోట్లు కాదా? గత ప్రభుత్వంలో డ్రైనేజీ కి 100 కోట్లు తెచ్చాం. ఆ నిధులు ఏం చేశారు, డ్రైనేజీని మురుకికుపాలుగా చేశారు

మున్సిపాలిటీలో నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లతో లాలూచీపడి కమిషన్ కక్కుర్తి పడి మొన్ననే బ్రహ్మపురంలో మీ ధన దాహానికి పసిపిల్లాడు బలైపోయాడు. విశాఖ లో గ్యాస్ ప్రమాదంలో మరణించిన పేదలకు 25 లక్షలు ఇచ్చిన మీరు బందర్లో మీ నిర్లక్ష్యం వల్ల బలైపోయిన ఈ బిడ్డకు ఎందుకు పైసా కూడా ఇవ్వలేదు.

ఇక ఇళ్ల పట్టాల దందా ఎక్కడపడితే అక్కడ ఇంటి పట్టాలంటూ దొంగ పట్టాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు.ఇంటి పట్టాలలో సర్వేనెంబర్ ఉంటుంది కానీ ఎస్ఎఫ్ నెంబర్ అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను చూస్తున్న వింత. వెళ్లిపోయిన ఎమ్మార్వో పేరిట దొంగ సంతకాలు చేసి ప్రజల్లో మోసం చేస్తున్నాడు. కొడుకుని అందలం ఎక్కించడానికి ఇంత నీచానికి వడిగడుతున్నాడు.

2009 ఎన్నికల ముందు కూడా కరగ్రక్రం లో ఇలాగే దొంగ పట్టాలి ఇచ్చి గ్రామస్తుల్ని మోసం చేశాడు . పేద ప్రజల ఉసురు తగలక మానదు. ఐదేళ్లుగా గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న జి +3 ఇల్లు ఇచ్చేకి మనసు రాలేదు ఈ తండ్రి కొడుకులు కి. మూడు స్తంభాల సెంటర్లోని కుమ్మరగూడెం, ఉలింగి పాలెం గుమ్మటాల చెరువులో కూడా ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి పట్టాలిస్తానంటున్నావ్. నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పు అవి పట్టాలి ఇవ్వడానికి సాధ్యపడుతుందా నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తా

మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మీరు చేసిన అన్యాయాలు వెలిగేతి చాటుదాం, ప్రజలందరికీ వివరిస్తాం. పేర్ని నాని మాటలు ప్రజలు నమ్మకండి గతంలో ఇళ్ల పట్టాల పేరుతో ఎలా మోసం చేశాడు ఇప్పుడు తన కొడుకును గెలిపించుకోవడానికి తిరిగి అదే మోసం చేస్తున్నాడు మేం అధికారంలోకి రాగానే ఆరులైన ప్రతివానికి 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాం, గ్రామ పెద్దలకు సమక్షంలో గ్రామసభలు నిర్వహించి అసైన్డ్ భూమి హక్కుదారులకు న్యాయం చేస్తాం.

అధికారంలోకి వచ్చిన 3 నెలలో జి+3 ల లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేయిస్తాం. పేర్ని కుటుంబం బందరు ప్రజలను చేస్తున్న మోసం ప్రజలందరూ గ్రహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ మోసాన్ని ఖండించింది పేర్ని కుటుంబం నుంచి బందరుకు విముక్తి కలిగించాలనీ ప్రజలకు కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, పార్టీ కార్యదర్శి పిప్పళ్ళ వెంకట కాంతారావు, మాజీ హోసింగ్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, సమన్వయ కమిటీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్, యూనిట్ ఇంచార్జ్ లంకే హరి, పట్టణ యువత అధ్యక్షుడు పిన్నింటి అయ్యప్ప మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE