Suryaa.co.in

Telangana

సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలి

– తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ టి.మాధవీదేవి తీర్పు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరగా, రిజర్వేషన్లను అమలు చేసేందుకు 30 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 3 నెలల సమయం ఇస్తూ.. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది.

LEAVE A RESPONSE