Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యాన్ని జైలులో పెట్టిన అమ్మ ఇందిరా

– దేశాన్ని అవినీతిమయం చేసిన కొడుకు రాజీవ్
– అనధికార ప్రధానిగా నియంతృత్వ, అవినీతి, విభజన పాలన నడిపించిన కోడలు సోనియా
– భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ

అమ‌రావ‌తి: నెహ్రూ నుండి రాహుల్ వరకు దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారు. నెహ్రూ దేశాన్ని ముక్కలు చేసి పరాయి దేశాలకు అప్పనంగా పప్పూ బెల్లం లాగా పంచిపెట్టిన తాత. ఇందిరగాంధీ ప్రజాస్వామ్యాన్ని జైలులో పెట్టిన అమ్మ. దేశాన్ని అవినీతిమయం చేసిన కొడుకు రాజీవ్. అనధికార ప్రధానిగా నియంతృత్వ, అవినీతి, విభజన పాలన నడిపించిన కోడలు సోనియా. దేశం, సైన్యం, ధర్మాన్ని అపహాస్యం చేస్తూ, దేశ విచ్ఛిన్నకర విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ పరాయి దేశాల ముందు మన దేశ, ప్రజల పరువు తీస్తున్న రాజకీయ వారసుడు మనవడు రాహుల్.

1975 జూన్ 25న భారతదేశ చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేని విధంగా ప్రజాస్వామ్య సూత్రాలు తురిపి పారేసిన రోజు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్ధంలో ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పౌర హక్కులను రద్దు చేసి, వేలాది మంది రాజకీయ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించారు. పత్రికలపై సెన్సార్ విధించి, స్వేచ్ఛా వాఖ్యానికి తాళాలు వేశారు.

అలహాబాద్ హైకోర్టు ఆమె ఎంపీగా ఎన్నికను చెల్లదంటూ తీర్పు ఇవ్వడంతో, తన పదవి కోల్పోతానన్న భయంతో ఆమె అర్థరాత్రి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. అధికారం కోసం, పదవి కోసం రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా మార్చిన ఇందిరా వారసులు నేడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.

పౌరుల అత్యంత ప్రాథమిక హక్కులు అయిన వ్యక్తిగత స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం, న్యాయ ప్రక్రియలన్నిటినీ అణచివేసిన ఇందిరా గాంధీ. నేడు ఆమె కోడలు సోనియా, మనువడు రాహుల్, మనవరాలు ప్రియాంక ప్రజల స్వేచ్ఛ గురించి, పత్రికా స్వాతంత్రం గురించి మాట్లాడటం దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది.

ఈ చీకటి కాలంలో – 250 పైగా పాత్రికేయులు జైలుకెళ్లారు. 1,00,000 పైగా సత్యాగ్రహులు అరెస్టయ్యారు. RSS, జనసంఘ్, ABVP కార్యకర్తలు బలమైన నిరసనలతో ముందుండి పోరాడారు, జైలుకు వెళ్ళారు. చిట్టచివరికి జనతా పార్టీ ఘనవిజయం సాధించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది. ప్రతిపక్షాల ఏకతాటిపై నడిపిన ఉద్యమం, ప్రజల సంకల్పం, యువత ధైర్యం, పాత్రికేయుల మానసిక బలమే ఈ చీకటి పేజీకి ముగింపు పలికింది.
ఈ రోజు జూన్ 25 – “బలిదాన దినం”*గా గుర్తించాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అలాంటి నియంతృత్వపు కుట్రలు పునరావృతం కాకుండా జాగృతంగా ఉండాల్సిన స్ఫూర్తిదాయక సమయం కూడా.

గాంధీ కుటుంబం ఎమర్జెన్సీ తరహా నియంత్రణ విధానాన్ని, ప్రజల మీద ఆధిపత్యాన్ని నేటికీ కొనసాగిస్తోంది. పేరు మారింది – ధోరణి మారలేదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తుంది. నియంతృత్వాన్ని తిరస్కరించి, నైతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉద్యమకారుల త్యాగమే ఈ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టింది.

LEAVE A RESPONSE