Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలకు అప్రకటిత కోతలతో విద్యుత్ కష్టాలు… జే ట్యాక్స్ పేరిట జగన్ రెడ్డికి కమీషన్లు

• నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.57 వేల కోట్లకు పైమాటే.
• షిరిడిసాయి, హిందుజా వంటి కమీషన్లు ఇచ్చే సంస్థలకు జగన్ రెడ్డి దోచిపెట్టింది. రూ.5,458కోట్లు.
• హిందుజా సంస్థ నుంచి 11 ఎకరాలు కొట్టేసిన జగన్, క్విడ్ ప్రోకో పద్ధతిలో ఆ సంస్థకు రూ.2,800కోట్ల ప్రజాధనం దోచిపెట్టారు
• అక్టోబర్ నెలలో జగన్ ప్రభుత్వ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు, రైతాంగం
• ప్రభుత్వాసుపత్రుల్లో సెల్ ఫోన్ల వెలుతురులో అత్యవసర శస్త్రచికిత్సలు చేసే దుస్థితి రాష్ట్రంలో దాపురించింది
– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నిశాఖల్లానే విద్యుత్ శాఖ కూడా ఘోరంగా విఫలమైందని, అక్టోబర్ నెలలోనే ప్రజలు తీవ్రమైన ఎండవేడికి అల్లాడుతుంటే, మరోపక్క ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలతో జనంతో ఆటలాడుతోందని, మరోపక్క సరైన వర్షాలు లేక, విద్యుత్ లేక, రైతులు కూడా తీవ్రకష్టాలు పడుతున్నారని, గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక అన్నదాతలు రాత్రిళ్లు కూడా మోటార్ల వద్దే పడుకుంటున్నారని, మరోపక్క ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు సెల్ ఫోన్ వెలుతురులోనే శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి దాపురించిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

విద్యుత్ కష్టాలు, ప్రజల అవస్థలకు కారణం జగన్ రెడ్డి చేతగానితనం.. అసమర్థ పాలనే. వాటికి తోడు జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తికూడా మరో ప్రధాన కారణం. రూ.12 వేలకోట్ల ప్రజలసొమ్ము అదనంగా చెల్లించి మరీ జగన్ సర్కార్ షిర్డిసాయి ఎలక్ట్రి కల్స్ సంస్థ నుంచి ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్ కంటే అధిక ధర పెట్టి, ఒక్కోట్రాన్స్ఫార్మర్ ను రూ.1,30,000లకు కొన్నారు. నాసిరకం పరికరాల వినియోగం వల్లే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బ్రేక్ డౌన్స్ జరుగుతున్నాయి. దానికి ప్రభు త్వం సాంకేతిక సమస్యలని సాకుగా చూపుతోంది.

హిందుజా సంస్థ నుంచి 11 ఎకరా లు కొట్టేసి, క్విడ్ ప్రోకోగా వారికి రూ.2,800కోట్ల ప్రజాధనం దోచిపెట్టారు. ఆ సంస్థ నుంచి రూ.12వేల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ ను రూ.18వేలకు కొన్నారు. సెకీ ఒప్పం దం ద్వారా ప్రజలపై రూ.20వేలకోట్ల భారం మోపారు. ఇదీ విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి సాధించిన ఘనకార్యం. ఇటీవల ఎన్టీపీసీలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి బ్రేక్ డౌన్ అయ్యింది. ఒక్క యూనిట్ మాత్రమే పనిచేస్తోంది.

చంద్రబాబునాయుడి హయాంలో మిగులు విద్యుత్.. జగన్ చేతగానితనంతో అప్రకటిత విద్యుత్ కోతలు
విద్యుత్ కోతలతో పాటు, లో ఓల్టేజ్ సరఫరా వల్ల గృహోపకరణాలు, రైతుల మోటార్లు దెబ్బతింటున్నాయి. కరెంట్ కష్టాలు భరించలేక చాలాప్రాంతాల్లో రైతులు విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడించడంతో, అక్కడి సిబ్బంది పారిపోయిన సందర్భాలున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సమస్యతో రైతులు వరినాట్లు వేయలేక, ఇతరరాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.

జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే రైతులు విద్యుత్ సమస్యలపై రోడ్డెక్కారు. విద్యుత్ రంగంపై జగన్ సర్కార్ చిత్తశుద్ధితో ఆలోచిస్తే, రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు వచ్చేవి కావు. చంద్రబాబునాయుడి హాయాంలో రాష్ట్రం మిగులు విద్యుత్ లో ఉంది. ఇతర రాష్ట్రాలకు నాణ్యమైన విద్యుత్ అందించేస్థాయికి ఏపీ ఎదిగింది. చంద్రబాబు హయాంలో ఏపీ19080 మెగావాట్ల మిగులు విద్యుత్ సాధించిన రాష్ట్రంగా నిలిచింది

నాలుగున్నరేళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.18వేలకోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పులు , హిందుజాసంస్థకు చేసిన చెల్లింపలు కలిపి రూ.57వేలకోట్లకు పైగా భారం ప్రజలపై మోపాడు
జగన్ నాలుగున్నరేళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపాడు. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటి వినియోగించే వినియోగదారులపై యూనిట్ కు రూ.90 పైసలు పెంచి, రూ.1300కోట్ల భారం మోపాడు. 2020 మేలో కరో నా కారణంగా స్లాబుల మార్పుపేరుతో రూ.1500కోట్ల భారం మోపాడు. 2021 ఏప్రియల్ లో కిలోవాట్ కు రూ.10లు పెంచి, రూ.3,542కోట్ల భారం మోపాడు.

2014-19 ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.3,669కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేశాడు. 2022 ఏప్రియల్ లో స్లాబుల కుదింపు పేరుతో రూ.3,900కోట్ల అదనపు భారం వేశా డు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ పేరుతో రూ.700కోట్లు, 2021-22 విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరుతో రూ.3,082కోట్లు, 2023 మే నుంచి ఫ్యుయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్ మెంట్ల పేరుతో రూ.400కోట్ల భారం మోపాడు.

మొత్తంగా దాదాపు రూ.18వేలకోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని జగన్ రెడ్డి జనంపై వేశాడు. ఈ భారం కాక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు రూ.36,261కోట్లు, హిందుజా సంస్థకు చెల్లించేందుకు తెచ్చిన అప్పు రూ.2,834కోట్లు. మొత్తం కలిపి రూ.57,148 కోట్ల విద్యుత్ సంస్థల అప్పుల్ని కూడా ప్రజలపైనే వేశాడు.

రకరకాల ఛార్జీల పేర్లతో జగన్ రెడ్డి మూడునెలల్లోనే ప్రజలపై రూ.2,900 కోట్ల భారం ప్రజలపై మోపాడు
ప్రతినెలా రకరకాల పేర్లతో విద్యుత్ వినియోగదారులపై భారం వేస్తున్నాడు. ఇంధన ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, ఆ సుంకంపై వడ్డీ, ఆ ఛార్జీలు..ఈ ఛార్జీలు అంటూ మే నెలలో రూ.363 కోట్లు ఇలా భారం వేస్తే, 2023 జూన్ లో రూ.1,804 కోట్లు, జూలైలో రూ.2,462కోట్ల భారం వేశాడు. మొత్తంగా దాదాపు రూ.2,900కోట్ల భారం ప్రజలపై వేశాడు. జగన్ ఛార్జీల పెంపు దెబ్బకి ప్రజలకు కరెంట్ బిల్ పట్టుకుంటేనే షాక్ కొడుతోంది.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 36 లక్షల గృహకనెక్షన్లు, 3.26లక్షల వ్యవసాయ కనెక్షన్లు అందిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో 8 లక్షల గృహకనెక్షన్లు, 17వేల వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే అందించాడు
విద్యుత్ రంగానికి సంబంధించి గతప్రభుత్వం చేసుకున్న పీపీఏలను జగన్ రెడ్డి రద్దు చేశాడు. కేంద్రం చెప్పినా, చంద్రబాబు చెప్పినా వినకుండా పీపీఏలు రద్దు చేసి, మొత్తం గా రాష్ట్రప్రజల్ని చీకట్లలో ముంచాడు. 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందు పట్టణాల్లో రోజూ 8 నుంచి 12గంటలవరకు విద్యుత్ కోతలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2018-19 నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ లో నిలిపారు. దాంతో పాటు, ఐదేళ్లలో చంద్రబాబు రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రజలపై పైసా భారం వేయలేదు.

కర్నూల్ లో మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేయించిన చంద్రబాబు, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు, రాయలసీమ యువతకు ఉపాధి కల్పించాడు. ఆసియాలోనే అతిపెద్ద మెగా సోలార్ పార్క్ గా అది నిలిచింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని చంద్రబాబు బాగా పెంచారు. జగన్ రెడ్డి వచ్చాక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. చివరకు ఈ ముఖ్య మంత్రి పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించే దుస్థితికి వచ్చాడు.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 36లక్షల గృహవిద్యుత్ కనెక్షన్లు అందిస్తే, జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో కేవలం 8లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చాడు. చంద్రబాబుహయాంలో 3.26 లక్షల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ అందిస్తే, జగన్ రెడ్డి కేవలం 17వేల కనెక్షన్లు మాత్రమే అందించాడు. విద్యుత్ రంగమే కాదు.. ఏ అంశంలో చూసినా చంద్రబాబుకి, జగన్ రెడ్డికి ఆకాశానికి.. నేలకు ఉన్నంత తేడా ఉంది.

తన కమీషన్ల కోసం హిందుజా, షిరిడిసాయి సంస్థలకు రూ.5,458 కోట్లు దోచిపెట్టారు
అధికధరకు బయట మార్కెట్లో విద్యుత్ కొనడం…తన దోపిడీ కమీషన్ల భారాన్ని ప్రజలపై వేయడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. కేవలం కమీషన్ల కోసమే షిర్డిసాయి, హిందుజా వంటి సంస్థల్ని జగన్ తనబినామీ కంపెనీల్లా మార్చుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాల కొనుగోళ్ల కోసం షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు 2019-20లో రాష్ట్రప్రభుత్వం రూ.469 కోట్లు, 2020-21లో రూ.612కోట్లు, 2021-22 లో రూ.945కోట్లు, 2022-23 (డిసెంబర్ వరకు) లో రూ.598 కోట్లు దోచిపెట్టారు. మొత్తంగా రూ.2,624కోట్లు షిరిడిసాయి సంస్థకు చెల్లించారు.

హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి విద్యుత్ కొనకుండానే స్థిరఛార్జీల పేరుతో రూ.2,834 కోట్లు చెల్లించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. ఆ డబ్బుచెల్లించడానికి ఆర్.ఈ.ఎల్ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ 9.5 శాతం వడ్డీతో అప్పు తీసుకోవాలని విద్యుత్ డిస్కంలను ప్రభుత్వమే ఆదేశించింది. హిందుజా సంస్థకు చేసిన చెల్లింపులు చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెప్పినా ముఖ్యమంత్రి తన ప్రయోజ నాలకోసం ఆసంస్థకు ప్రజలసొమ్ముని దోచిపెట్టారు.

అందుకు ప్రతిఫలంగా హిందుజా సంస్థకు చెందిన హైదరాబాద్ లోని 11ఎకరాలు క్విడ్ ప్రోకో పద్ధతిలో తన పరం చేసు కున్నారు. ఇలా సొంత లాభం కోసం జగన్, విద్యుత్ సంస్థల్ని దెబ్బతీసి, వాటిని అడ్డం పెట్టుకొని ప్రజలపై భారీస్థాయిలో భారం వేస్తున్నాడు.

విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టడు.. అధికధరకు బయట మార్కెట్లో విద్యుత్ కొంటాడు.. అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని మూసేయిస్తాడు..ఇదీ జగన్ విధానం
విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టకుండా, తక్కువ ధరకు లభించేచోట విద్యుత్ కొనకుండా, కేవలం తన కమీషన్లకోసమే జగన్ అధికధరకు విద్యుత్ కొంటున్నాడు. మైలవరం సోలార్ ప్లాంట్ పై దాడి చేయడం.. గ్రీన్ ఎనర్జీ పీపీఏలు రద్దుచేయడం… రివర్స్ టెండ రింగ్ పేరుతో 960 మెగాయూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకపోవడం, కావాల్సిన స్థాయిలో బొగ్గుని నిల్వచేయకపోవడం, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను గాడిలో పెట్టడం వంటి ఎలాంటి చర్యలకు జగన్ పూనుకోలేదు.

నాలుగున్నరే ళ్లలో జగన్ రెడ్డి ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేసింది లేదు. విద్యుత్ కోతల వల్ల రాష్ట్రం కుదేలవుతున్నా.. కోతలు లేవనే చెబుతున్నారు. కోతలున్నాయని చెప్పుకోవడానికి జగన్ రెడ్డికి నామోషీ. రాష్ట్రానికి సక్రమంగా విద్యుత్ అందించలేని జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడు. చంద్రబాబు ముఖ్యమం త్రి అయితేనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేకుండాపోతాయి.” అని రఫీ తేల్చిచెప్పారు

LEAVE A RESPONSE