అక్కన్న-మాదన్న ఆలయంలో ఏనుగు మృతి

పాతబస్తీ బోనాలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ ఘట్టాన్ని ఉరేగించే సుధారాణి అనే ఏనుగు మృతి. ఏనుగు మృతి వార్త తెలియడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చి, సుధారాణి మృతదేహానికి పూజలు చేశారు. ఏళ్లపాటు సేవలందించిన ఏనుగు మృతి చెందడంపై మహిళా భక్తులు కన్నీరు పెట్టుకున్నారు.