పిఆర్‌సి అమలుపై ముఖ్యమంత్రి జగన్‌ చేసుకోవాలి

-ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
అమరావతి : నెలాఖరులోగా పిఆర్‌సి అమలు కాకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశంలో పాల్గన్న ఆయన మాట్లాడుతూ.. ఎపిలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రికి వెళ్లేందుకు హెల్త్‌ కార్డులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. పిఆర్‌సి అమలుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు. గత నెలలోనే పిఆర్‌సి అమలు చేస్తామని సజ్జల అన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక ఓపిక పట్టే పరిస్థితి తేదని, ఈ నెలఖరులోగా పిఆర్‌సి అమలు చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Leave a Reply