Suryaa.co.in

Andhra Pradesh International

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో జగన్‌ పాలన అంతమొందించాలి

– టీడీపీ ఎన్నారై నేతల పిలుపు

ఎన్టీఆర్ స్పూర్తితో జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని జయరాం కోమటి అన్నారు. అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు జరిగింది.

ఈ సందర్భంగా టిడిపి ఎన్నారై కోఆర్డినేటర్ జయరాం మాట్లాడుతూ పాలకపక్ష వికృత చేష్టలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైసిపి దోపిడీ పాలన చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టడానికిnri వెనకాడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడం పట్ల తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తెలుగువాడి గుండె చప్పుడైన ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డికి వికేంద్రీకరణ గురించిnri1 మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవటమేమిటని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు మంత్రులే ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.

మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీలో చట్టబద్ధ పాలన లేదు. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారన్నారు. విశాఖలో భూములు దోచుకున్న విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

శ్రీనాధ్ రావుల నేతృత్వంలో ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అనంతరం చిన్నారులు గేయాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన, బోయపాటి వెంకటరమణ, డి.వి శేఖర్, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, రవి మందలపు, శ్రీనివాస్ కూకుట్ల, భాను మాగులూరి తదితరులు ప్రసంగించారు. మహేష్ నెలకుదిటి, శ్రీనివాసరావు దామా, శ్రీనివాసరం సామినేని, వాసు గోరంట్ల, శివ నెల్లూరి, జానకి భోగినేని, హర్ష పేరంనేని, వెంకట్ కూకట్ల, హరీష్ కూకట్ల తీర్మానాలు ప్రవేశ పెట్టారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి
అన్నా క్యాంటీన్లు పునప్రారంభించాలి
పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి
తదితర అంశాలపై తీర్మానాలు చేసారు.
వర్జీనియా, పెన్సిల్వేనియా, డెల్లావేరు తదితర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు.

LEAVE A RESPONSE