– ఎన్నికలను అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి
– మాటల్లో చెప్పలేని విధంగా వైసీపీ అరాచకాలు
– రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా?
– నారా చంద్రబాబునాయుడు
చరిత్రలో ఎన్నడూ ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిన సందర్భాలు లేవు. ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్టపాలైంది. ప్రజల్లో ఈ ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహావేశాలు ఉన్నాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు పనులు చేసి గెలిచామని చెప్పుకోవడానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. వైసీపీ పార్టీ మరలా అధికారంలోకి రావడం కాదు కదా భవిష్యత్తులో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డిలా నీచంగా, దారుణంగా, అక్రమంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రిని చూడలేదు.
ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిరీర్యం అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోంది. పోలీసులు దొంగలకు వంతపాడే పరిస్థితికి వచ్చారు. ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. దొంగ ఓటర్లను
పట్టుకుని నిలదీస్తున్నా సిగ్గూ యగ్గూ లేకుండా మరలా వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు. దొంగఓటర్లు వైసీపీ నాయకులు ఇచ్చే రూ.10 డబ్బులకోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇంట్లో సొంత కుటుంబ సభ్యులతో కూడా ముఖాన ఊయించుకునే పరిస్థితి వచ్చారు.
ఇంట్లో ఆడబిడ్డలు కూడా దొంగ ఓట్లు వేసే మగవాళ్లను చీకొట్టే పరిస్థితి వచ్చింది. కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు విజయవాణి స్కూలుకు వెళ్లి నిరూపించడం జరిగింది. సి.ఎల్.ఆర్.పి బిల్డింగ్-గణేష్ పురం, జివీకే కళ్యాణమండపం – 9వ వార్డు, మార్కెట్ యార్డు, హవాకింగ్ స్కూలు, కుడా ఆపీస్, టిటిడి కళ్యాణమండపం, సోమ రమారెడ్డి ఫాం హౌస్ లలో దొంగ ఓటర్లను దించి నీచ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు.
విజయవాణి స్కూలులో నిన్నటి రాత్రి హైడ్రామా నడిచింది. రాజకీయాలు ఇంత అసహ్యంగా ఉంటాయా అనే పరిస్థితి వైసీపీ నాయకులు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా అని అడుగుతున్నాను. ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించుకుని, అభ్యర్ధులను నామినేట్ చేసుకోమనండి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని వాటిని సరిగా నిర్వహించకపోతే అది ఎన్నికల సంఘం తప్పిదం అవుతుంది. ఇంతటి దారుణం మునుపెన్నడూ జరగలేదు.
తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. తెల్లవారు జామున తెదేపా ఏజెంట్లను అరెస్టు చేశారు. వారిని తీసుకువెళ్లి ఇతర పోలీస్ స్టేషన్లలో పెట్టారు. పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేసే అర్హత పోలీసులకు లేదు. ఇది చట్ట వ్యతిరేకం. పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేసి యదేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు.
వైసీపీ నాయకుడికి, ఆ పార్టీ కార్యకర్తలకు సిగ్గు, యగ్గు లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నందుకు ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలు చేస్తూ సమాజాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నారు? వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఒక్క గ్రామాన్ని కూడా వదలకుండా ఎన్నికల అరాచకాలకు పాల్పడ్డారు. దొంగ ఓటర్లను మన రాష్ట్రంలోనే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి సైతం దిగుమతి చేసుకున్నారు. ఇందుకోసం పెద్ద పెద్ద వాహనాలను, కార్లను వాడుతున్నారు. సిగ్గులేకుండా నాయకులే మా నాయకుడు రమ్మన్నాడు కాబట్టి వచ్చాను అని చెబుతున్నాడు.
రాష్ట్రం మొత్తం పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, బై-ఎలక్షన్లలోనూ ఒక నీచమైన తప్పుడు సంస్కృతికి శ్రీకారం చుట్టారు. డబ్బులు, ప్రలోభాలు, వాలంటీర్ల బెదిరింపులు, పోలీసుల అత్యుత్సాహం, ఏజెంట్లను సైతం డబ్బులతో కొనేయడం లాంటి అప్రజాస్వామిక విధానాలతో అడుగడుగున ఉల్లంఘలను పాల్పడుతున్నారు. ఇంత నీచమైన రాజకీయం నా జీవితంలో చూడలేదు. ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న కొంతమంది పోలీసు ఆఫీసర్లు చాలా తప్పిదం చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. వీరి కారణంగా రాష్ట్రంలో ప్రజలు పోరాడే పరిస్థితికి వచ్చారు.
దొంగ ఓటర్లను అడ్డుకోవడమే కాకుండా వారిని పట్టించే పరిస్థితి వచ్చారు. ఈ పరిస్థితులు చూస్తుంటే పోలీసులకు సిగ్గనిపించడం లేదా? ఈ డ్యూటీ చేయాల్సింది ప్రజలా? ప్రజలు కడుతున్న టాక్స్ లతో వారి కష్టార్జితం తింటున్న అధికారం యంత్రాగం చేయాల్సిన విధి ప్రజలు చేస్తున్నారు. ప్రజలు సొత్తు తినే ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం చేయాల్సింది ప్రజలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలింగ్ బూత్ లోకి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కుప్పంలో వైసీపీ ఎంపీ, గుంటూరులో మేయర్ ఏవిధంగా పోలింగ్ సెంటర్ లోకి వెళ్లారు? ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి. ఇల్లీగల్ వెహికల్స్ వస్తే మేం పట్టించినా నిర్లక్ష్యం వహించారు. ఒక్క వాహనాన్నైనా సీజ్ చేశారా?
సమాధానం చెప్పాలి. మీ ఆటలు సాగవు. ప్రజలే తగిన సమాధానం చెబుతారు. దొంగ ఓట్లు ఇష్టారాజ్యంగా వేయించారు. ఎంతమందిపై కేసులు పెట్టారు, ఎంతమందిని పోలీసులకు హ్యాండోవర్ చేశారు. సమాధానం చెప్పాలి. మేం గట్టిగా అడిగితే.. దొంగ ఓట్లపై పోరాడే వారిపై లాఠీచార్జ్ చేస్తారా? ఎన్ని గట్స్ ఉండాలి మీకు?
లా అండ్ ఆర్డర్ పేరుతో ఇష్టారాజ్యంగా చేశారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందనే మేం వచ్చాం. ఎంతమందిని జైల్లో పెడతారు? ఎక్కడ చూసినా అరాచకం, తప్పుడు కేసులు. ఎన్నికల్లో గెలవడానికి నానా గడ్డి తింటారా? మీ ఆటలు సాగనివ్వం. ప్రతి ఒక్కటి మైండ్ గేమ్ ఆడతారా? ఆ రోజులు అయిపోయాయి. ప్రజలే మీతో మైండ్ గేమ్ ఆడతారు. బయటకు వెళితే ఎవరు తంతారో అనే పరిస్థితి వైసీపీకి వచ్చింది. లోకేష్ అనే వ్యక్తిని కొడతారా? తిరిగి మాపైనే కేసులు పెడతారా? ఇదెక్కడి చోద్యం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం.
ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం కాపాడుకుంటే ఆ వ్యవస్థలు మనల్ని కాపాడతాయని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఉన్మాదులు అర్థరాత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రేపు మనకు, మన పిల్లలకు రక్షణ లేని పరిస్థితి వస్తుంది. కుప్పంలో వీరోచితంగా ముందుకు వచ్చిన ప్రజలను అభినందిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ రౌడీయిజం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే బాధేస్తోంది. నామినేషన్లను అడ్డుకున్నారు. మేం పోరాడాం. బోగస్ విత్ డ్రాయల్స్ చేశారు. ఇవాళ దొంగ ఓటర్లను పంపారు. రేపు స్ట్రాంగ్ రూమ్ లు పెట్టాలి. అక్కడా మానిపులేట్ చేస్తారు. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ లేదని చూపించాలను కుంటున్నారు. ప్రజల్లో గుండెల్లో టీడీపీ ఉంది.
మేం పోరాడేది మున్సిపల్ ఎన్నికల కోసం కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. యువతను పావులుగా వాడుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రజల ముందు వైసీపీని దోషిగా నిలబెట్టేవరకు వదిలపెట్టబోమని హెచ్చరిస్తున్నాం. రాజకీయ పార్టీగా ఉండాల్సిన అర్హతే వైసీపీకి లేదు. ఎలక్షన్ కమిషన్ అనేదే లేదు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. టీడీపీ ముందు మీ కుప్పిగంతలు పనిచేయవు.