Home » ఉద్యోగుల పక్షపాతి డి.శ్రీనివాస్

ఉద్యోగుల పక్షపాతి డి.శ్రీనివాస్

-ఉద్యోగుల కోసం సీఎంలతోనే పోరాడిన నేత
-ఎమ్మెల్సీ అశోక్ నివాళి

మంగళగిరి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మృతిపై టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీఎన్జీఓ సంఘ మాజీ నేత అశోక్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

డి. శ్రీనివాస్ ఉద్యోగుల పక్షపాతి. 2010 అక్టోబర్ లో నేను APNGO అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు 9వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) వ్యవహారంలో ఉద్యోగుల పక్షాన నిలబడి డి. శ్రీనివాస్ మద్దతు తెలపడం ఎన్నటికీ మరచిపోలేను.

నాటి రోశయ్య ప్రభుత్వం 38 శాతం ఫిట్ మెంట్ ప్రతిపాదించగా.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 39 శాతం ఇవ్వాలని డి. శ్రీనివాస్ ఉద్యోగుల తరపున గట్టిగా వాదించారు. నాడు డి. శ్రీనివాస్ రోశయ్యతో మాట్లాడుతూ.. నేనేగాని ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఒక్క శాతం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఈ విధంగా బ్రతిమాలుకునేలా చేసేవాడినే కాదని ఆయన రోశయ్యతో చెప్పారు.

దానికి రోశయ్య అయితే నువ్వే ఈ కుర్చీలో కూర్చొని, ఆ 29 శాతం ఫిట్ మెంట్ నువ్వే వారికి ఇవ్వు అని వ్యంగంగా మాట్లాడారు. అందుకు డి. శ్రీనివాస్ ఒక సీనియర్ నాయకుడైన మీరు వ్యంగ్యంగా మాట్లాడడంకంటే, సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పారు. చాలా సుదీర్ఘ చర్చ తరువాత నాటి ముఖ్యమంత్రి రోశయ్య 39 శాతం ఫిట్ మెంట్ కు ఒప్పుకున్నారు.

9వ పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో డి. శ్రీనివాస్ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి కోసం ముఖ్యమంత్రితోనే వాదనకు దిగటాన్ని ఎన్నటికీ మరచిపోలేను. ఏపీఎన్ జీవో, టీఎన్ జీవోలు సంఘాలు వినతి కోసం ఆయన నేరుగా ముఖ్యమంత్రి రోశయ్య ఇంటికే వచ్చారు. ఈ విషయం రెండు రాష్ట్రాల్లోని చాలామంది ఉద్యోగులకు తెలియదు. డి. శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Leave a Reply