Suryaa.co.in

Andhra Pradesh

సన్న బియ్యం పండించేందుకు రైతులకు ప్రోత్సాహం ఇవ్వండి

– రైస్ మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన

విజయవాడ:రైతులు ఖరీఫ్ సీజన్‌లో ప్రజలు కోరుకునే సన్న బియ్యం పండించేలా రైస్ మిల్లర్లు ప్రోత్సహించాల‌ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ఈరోజు జరిగిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశంలో మంత్రి మాట్లాడారు.

“రైతులకు లాభం చేకూరేలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మిల్లర్లు సమిష్టిగా పనిచేయాలి. దేశీయ వినియోగం మాత్రమే కాదు, బియ్యం ఎగుమతులు (ఎక్స్‌పోర్ట్) కూడా లక్ష్యంగా పెట్టుకుని మిల్లర్లు ముందుకు సాగాలి,” అని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని సన్న బియ్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, అందుకే రైతులు ఆ దిశగా మొగ్గు చూపేలా రైస్ మిల్లర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE