– ప్రతి నెల 25 నుంచి 30 తేదీ లోపు 65 ఏళ్ల పైన వృద్ధులకు, దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే రేషన్ సరుకులు అందజేయాలి
– చౌక ధర దుకాణదారులకు, అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు
విజయవాడ: రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతి నెల 26వ తేదీ నుంచి 30 తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందజేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ చౌకధర దుకాణదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రేషన్ సరుకుల పంపిణీ మొదటి 15 రోజుల్లోనే 89.64% విజయవంతంగా పూర్తి కావడం ప్రజా పంపిణీ చరిత్రలో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డు దారులకు సరుకుల పంపిణీ ప్రారంభమై, ఇప్పటివరకు 1,30,94,539 మందికి రేషన్ సరుకులు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాక, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకురావడమైందని, ఇప్పటి వరకు 13,14,140 మందికి ఈ విధంగా పంపిణీ చేశామని తెలిపారు — ఇది 83% విజయవంతంగా అందజేయడం జరిగింది.
రేషన్ సంస్కరణల్లో భాగంగా ఐదు రోజులు ముందుగానే ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీ లోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయాలన్నారు.