మంచి నీళ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం చేతకాని మంత్రి సురేష్ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు
-అక్రమార్జన కేసులో సుప్రీం విచారణ ఎదుర్కొంటున్న సురేష్ చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేయటం హాస్యాస్పదం
– టీడీపీ అధికారంలోకి రాగానే నాడు నేడులో సురేష్ చేసిన అక్రమాలు వెలికితీస్తాం
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు
సొంత నియోజకవర్గంలో నీటి సరఫరా చేసిన వైసీపీ నేతలకు బిల్లులు చెల్లించటం చేతకాని మంత్రి ఆదిమూలపు సురేష్.. చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు సిమెన్స్ లో అవినీతికి పాల్పడ్డారంటూ మంత్రి సురేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న మంత్రి సురేష్ చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేయటం హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడుని విమర్శించే అర్హత సురేష్ కి లేదు.
సురేష్ విద్యా శాఖా మంత్రిగా నాడు నేడు పేరుతో వేల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నాడు నేడు కార్యక్రమంపై విచారణ చేపట్టి ఆయన అవినీతికి వెలికితీస్తాం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రులు, సచివాలయాల నిర్మాణాలకు ఇచ్చిన ఇసుక ఏమైందో సురేష్ చెప్పాలి. ఇసుక అక్రమాలపై వైసీపీ సర్పంచ్ లే కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన అంశం సురేష్ మర్చిపోయారా? రెండు సార్లు మంత్రిగా ఉన్న సురేష్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ది ఏంటో ప్రజలకు చేసిన మేలోంటో చెప్పాలి. సురేష్ పనితీరు సొంత పార్టీ నేతలకే నచ్చటం లేదని ఇక ప్రజలకు ఏం నచ్చుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ, జనసేన పొత్తుల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీ నేతలకు ఎందుకు? అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్దులున్నారా? వైసీపీ నాలుగేల్ల పాలనలో వైసీపీ నేతలు దోచుకోవటం దాచుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురడం ఖాయం.