– తులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదు
– ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు
– రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు
– మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్: సీఎం ప్రకటన చేస్తే అమలు చేయాలి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్తితి లేదు. నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నం అన్నాడు. ఇంతవరకు 3 లక్షల 13 మంది రైతులకు 2474 కోట్లు ఇంత వరకు రైతు ఖాతాలో పడలేదు. చెక్ కూడా బౌన్స్ అయినట్లే . 19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో అమౌంట్ పడలేదు.
ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరి లో PRC బకాయిల చెక్ 281 కోట్ల చెక్ కూడా జమ కాలేదు. అది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో జమ చేశారు. 1 లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారు. కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయింది. 2015 బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినం. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తుంది. 5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు. మిగతా వాటికి వడ్డీ కట్టాల్సిందే. లక్ష కోట్లు అని చెప్పింది అంతా అబద్ధం.
ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదు. తులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. అన్ని ఉత్త మాటలే. బతుకమ్మ చీరలు లేవు. రూల్స్ ప్రకారం సభను నడపడం లేదు. నాడు భట్టి,శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా? ఇవాళ ఇదేం న్యాయం? పార్లమెంట్ లో మాత్రం ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు,రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు.