Suryaa.co.in

Andhra Pradesh

చిరంజీవి చెప్పినా మాకేమీ నష్టం లేదు

– చిరంజీవి ఎన్డీఏ వైపు ఉండటం మాకే మంచిది
– చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు
– పవన్ కళ్యాణ్ ఆలోచన,అవగాహనా లేని ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్
– సీఎం జగన్ మోహన్ రెడ్డి 25 వ తేదిన నామినేషన్ వేస్తారు
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు చేసే జగన్ కావాలో…నిత్యం మోసాలు,వెన్నుపోట్లు,అరాచకాలకు పాల్పడే చంద్రబాబు అండ్ కో కావాలో ప్రజలు తేల్చుకోవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ స్దితిగతులను మంత్రి జోగి రమేష్,పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కొద్దిసేపు సమీక్షించిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

వైయస్సార్ సిపి ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి ఫలాలు 80 శాతం ప్రజలకు చేరాయి. జగన్ ని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నాడు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీతో కూటమిగా పార్టీలు జట్టు కట్టాయి.కూటమికి అజెండా లేదు. నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పెనమలూరు నుంచి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారు. పెనమలూరులో మా పార్టీకి గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ఇమ్మెచ్యుర్డ్ పొలిటీషియన్
పవన్ కల్యాణ్ ఓ పార్టీ అధినేత అనేది పక్కన పెడితే ఆయన జనసేన పార్టీని ఎందుకు పెట్టాడో తెలియదు.నాయకుడుగా ఆయన ఆలోచనల్లో ఎప్పుడూ స్పష్టత లేదు. బహుశా చంద్రబాబు కోసమే ఆయన పుట్టినట్లు…పెరిగినట్లుగా ఉన్నాడు. చంద్రబాబుకే అంకితమైనట్లుగా ఉన్నాడు.ఈ ఎన్నికలలో చంద్రబాబు పార్టీ అంతం కావడంతో పవన్ కల్యాణ్ రాజకీయఅంకం కూడా ముగుస్తుందన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు

చిరంజీవి కూటమి మధ్దతు ప్రకటించడంతో ఏపి రాజకీయాలలో క్లారిటీ వచ్చింది
చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిరంజీవి ఆ విధంగా చెప్పడం మాకు మరీ మంచిది. చిరంజీవే కాదు మొత్తం శక్తులన్నీ ఏకమయ్యాయి. దానికి ఒకరో,ఇద్దరో అదనంగా తోడైతే వారికి ఒరిగేదేమి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయతెరపై ఒక స్పష్టత ఉంది. జగన్ ఒక్కరూ ఒకవైపు ఉన్నారు. తోడేళ్ళు,హైనాలు, గుంట నక్కలు,ముళ్లపందులు అన్నీమరోవైపు ఉన్నాయి.

వైయస్ జగన్ ఈనెల 25 వతేదీన నామినేషన్ వేస్తారు
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నియోజకవర్గాలలో ప్రచారం జరుగుతున్న తీరు,పార్టీ శ్రేణులు ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశాలపై సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలలో పార్టీ పరిస్దితి చాలాబాగుంది. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.మే లో జరగనున్న ఎన్నికలలో వైయస్సార్ సిపి విజయం ఖాయం అయిందని తెలియచేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 25 వతేదీన నామినేషన్ దాఖలు చేస్తారని వివరించారు

LEAVE A RESPONSE