Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల ఓట్లపై వైసీపీ కుట్ర

– పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర
– వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేస్తారని…
– ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు పద్ధతి మార్చుకోవాలి
– ఉద్యోగులను అయోమయం చేస్తూ… ఫారం 12 లను తీసుకోని అధికారులపై చర్యలు తప్పవు
– టీడీపీ విజ్ఞప్తితో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ నూతన ఆదేశాలు
– ఫారం 12 లను ఉద్యోగుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత నియోజక వర్గాల్లో ఏఆర్వో, ఆర్వోలదే
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు

వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ఉద్యోగస్తులు సిద్ధం అయ్యారని తెలిసే పోస్టల్ బ్యాలెట్ పై కుట్రలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తారనే భయంతో పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు, కొందరు అధికారులతో చేతులు కలిపి కుట్ర చేస్తుందని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఉద్యోగులను చూసి జగన్ రెడ్డి వణికి పోతున్నాడని అశోక్ బాబు అన్నారు. జగన్ రెడ్డి కోసం పనిచేస్తున్న కొంత మంది అధికారులు, ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాకుండా చేసేందుకు అయోమయానికి గురి చేస్తూ.. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ అందకుండా చేశారన్నారు. ఆదేశాలు లేవంటూ ఫారం12 లను తీసుకోవడం లేదని, ఫారం 12లను తీసుకున్నా ఎక్ నాలెడ్జ్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.

నోడల్ ఆఫీసర్లు ఎవరో ఇంకా స్పష్టత లేకుండా ఉందన్నారు. కొన్ని చోట్ల నోడల్ ఆఫీసర్లను ఇంకా నియమించలేదన్నారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకుని నోడల్ అధికారులను నియమించి, నోడల్ ఆఫీసర్ ఎవరో కింది స్థాయి అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఫారమ్ 12ను ఉద్యోగస్తుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత, నియోజకవర్గాల్లో డూటీలో ఉన్న ఏఆర్వో, ఆర్వోలదేనని తెలిపారు. దీనిపై నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటారన్నారు.

ఉద్యోగస్తులు ఫారం 12 ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్ నాలెడ్జ్ మెంట్ తీసుకోవాలని సూచించారు. వైసీపీ ఉద్యోగుల ఓట్లపై కుట్ర చేస్తుందన్నారు. దీన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు గమనించాలన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగ రిత్యా అధికారులు ఎవరైనా నియోజకవర్గంలో ఉన్నా ఫారం 12 కాపీలను తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్వో, ఆర్వోలపై ఉందన్నారు. ఖచ్చితంగా వారికి అందజేయాలన్నారు. మార్చి 26 నుండి వెలగపూడి సచివాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫారం12పై పనిచేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గాల ఫారం 12 లు అన్నీ కూడా ఆ నియోజకవర్గాలకు వెళతాయి అని స్పష్టం చేశారు.

ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులంతా ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనీ అశోక్ బాబు సూచించారు. లక్షల్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ లను తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. దీన్ని ఉద్యోగులు గమనించాలన్నారు. ఉద్యోలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వంతోనే ఉద్యోగులకు మంచి జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుందన్నారు.

LEAVE A RESPONSE