– బోర్డు పేరుతో వాళ్లే ఆమోదించుకున్నారు
– జగన్ కు టామోటా, పొటాటో కి తేడా తెలియదు
పొన్నవోలు సిగ్గులేకుండా వాగుతున్నాడు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్
విజయవాడ: లడ్డూ తయారీ నాణ్యతలో వైసీపీ నేతలు రాజీ పడ్డారు. నేతి సరఫరాలో కొవ్వు కలపడం ద్వారా అపవిత్రం చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయ్యింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బ తీశారు.
టీటీడీ ఆస్తులను వేలం వేసేందుకు యత్నించారు, నిధులను దారి మళ్లించేందుకు కుట్ర చేశారు. ఇప్పుడు చేసిన నేరం అమానుషం. ఈ అపచారం చేసిన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలి.
బోర్డులో బీజేపీలో ఉన్నారని నిందను, మాకు ఆపాదించాలని జగన్ చూస్తున్నారు. టీటీడీలో సీఎం, ఛైర్మన్, ఇఓ తప్ప, సభ్యులు అందరూ డమ్మీలే కదా? వాళ్ల ముగ్గురు నిర్ణయాలు తీసుకుని, బోర్డు మీటింగ్ ల పేరుతో ఆమోదించేవారు. జగన్ తాను చేసిన తప్పుల నుంచి దృష్టి mమళ్లించేందుకు, బీజేపీ నేతల పాత్ర ఉందని చెబుతున్నారు. సీఎం గా ఉండి టీటీడీలో జరిగే అపచారాలను ఆపే బాధ్యత జగన్ కు లేదా?
పొన్నవోలు సిగ్గులేకుండా వాగుతున్నాడు. బుద్ది ఉందా? జగన్ కు టామోటా, పోటాటోకు తేడా తెలియదు.ఐదు నిమిషాలు మాట్లాడేతే అతనిలో డొల్ల తనం బయటపడతుంది.
లడ్డూ పాపంలో ఎంతమంది భాగస్వామ్యం ఉన్నా శిక్షించాల్సిందే. ఇప్పటికే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు.చివరకు అధికారులు కూడా సరైన వారు కాదని జగన్ సర్టిఫికెట్ ఇవ్వడం హాస్యాస్పదం.నెయ్యి కాంట్రాక్టులో కమీషన్లు బొక్కి, స్వామి వారికి అపచారం చేశారు. కాబట్టి అందరూ తప్పకుండా విచారణ ఎదుర్కొని శిక్షకు గురి కావాల్సిందే.