అవ్వా తాతల పెన్షన్ లలో కోతలు విధించడం జగన్ కే సాధ్యం

– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
అవ్వా తాతల పెన్షన్ లలో కోతలు విధించడం జగన్ కే సాధ్యమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి వస్తే రూ.3వేలు పెన్షన్ ఇస్తామని చేసిన వాగ్దానం అమలుకాలేదన్నారు. సామాజిక భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వం సామాజిక భ్రదతకు తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని తెలిపారు. గత నెలలో ఒక కార్డుకు ఒకే పెన్షన్ అన్నారు, ఇది సబబుకాదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు పెంచాల్సిందిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. పెన్షన్ విధానానికి తూట్లు పొడవడం మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూశామన్నారు. వాలంటీర్లు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వృద్ధులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు.
కుంటిసాకులు చెప్పి పెన్షన్లల్లో కోత విధించడం తగదన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా ఇస్తామన్న పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారుటీడీపీ హయాంలో రెండు, మూడు నెలలకు కూడా పెన్షన్లు తీసుకోవడానికి అవకాశముండేది. ఆ అవకాశాన్ని ప్రస్తుత లేకుండా చేయడం అన్యాయం. వేరే ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకునేవారు, పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. . పెన్షన్లపై ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్న వృద్ధులకు అన్యాయం చేయొద్దని మరోసారి ఆలోచించాలని కోరారు.

Leave a Reply