Home » తల్లిని, చెల్లినే పలకరించని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు.?

తల్లిని, చెల్లినే పలకరించని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు.?

– రాజశేఖర్ రెడ్డి వర్థంతి సభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు వెళ్లలేదు.?
– సీఎంను, నేతలను వైయస్ ఆత్మ వెళ్లొద్దని చెప్పిందా.?
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి
జగన్మోహన్ రెడ్డి పదేపదే అక్కచెల్లెమ్మలకు, ఆడబిడ్డలకు తాను మేనమామనని, మహిళ పక్షపాతి నని రెండున్నరేళ్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. మహిళలంటే జగన్ కు గౌరవం వుందా.? దిశ చట్టంతో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తానన్న మీకు. మహిళలంటే మొదట మీకు గౌరవం వుందా? రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర తల్లి, చెల్లి కూర్చుంటే పలకరించని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలను గౌరవిస్తారా.? రాజశేఖర్ రెడ్డి వర్థంతి సభకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లలేదు.? ఆ సంస్మరణ సభకు జగన్ వెళ్లొద్దన్నారా.?
సీఎంను, ఎమ్మెల్యేలను వైయస్ ఆత్మ వెళ్లొద్దని చెప్పిందా.? 45 నిమిషాలు తల్లి, చెల్లి పక్కనే కూర్చుంటే మాట్లాడని వ్యక్తి మహిళలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. చనిపోయిన తర్వాత రూ.5, రూ.10 లక్షల డబ్బులిస్తున్నారు. ఇడుపులపాయలో తల్లిని పిలవడు, తండ్రి వర్థంతి సభకు పిలిస్తే వెళ్లడు. వైయస్ దేవుడు, ఆయన వల్లే గెలిచామని చెప్పుకునే 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఎందుకు వెళ్లలేదు.?
ఆ కార్యక్రమానికి విజయమ్మ నాయకత్వం వహించారు. వైసీపీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా వున్నారు. షర్మిల పార్టీకి గౌరవాధ్యక్షురాలని చెప్పుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు గౌరవాధ్యక్షురాలుగా వున్నారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తి మహిళల గౌరవం కోసం పాటుపడతాననడం చెప్పడం ఎంత వరకు సబబు..? 28 రాష్ట్రాల్లో జరగనన్ని అఘాయిత్యాలు రాష్ట్రంలో జరగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. సొంత చెల్లి, తల్లిని గౌరవించలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలను ఏవిధంగా గౌరవించి, కాపాడతారు.?

Leave a Reply