– ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
పిఆర్శీ కమీషనర్ రికమెండ్ చేసిన పే స్కేల్సు బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే, ప్రభుత్వం గతంలో ఇచ్చిన కరెస్పొండింగ్ పే స్కేల్స్ బయటపెట్టి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుంది.. 11వ పిఆర్శీ నివేదికలో వ్యాలుం-III లోని షెడ్యూల్ 2 లో క్యాడర్ వారీగా రివైజ్డ్ స్కేల్సు పెంచిన గ్రేడ్ తో సహా బయటపెట్టమని AP JAC అమరావతి మరియు ఇతర ఉద్యోగ సంఘాలు గత సంవత్సరం కాలంగా అడుగుతుంటే, ప్రభుత్వo ఈ రోజు కేవలం షెడ్యూల్ 1 లో ఉన్న కరెస్పాండింగ్ పే స్కేల్స్ ను మళ్లి విడుదలచేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టామని నిర్లక్ష్యంగా మెమో విడుదల చేయడం ఉద్యోగులుకు చేస్తున్న అన్యాయం కాదా..!?
11వ PRC Commissioner గారు షుమారు రెండు సంవత్సరాల పాటు వివిధ ఉద్యోగ సంఘాల వారి వాదనలు విన్న తర్వాత వారి వారి వాదనలో న్యాయము ఉందని భావిస్తే, కొన్ని శాఖలలోని కొన్ని క్యాడర్ ఉద్యోగుల పే గ్రేడ్ పెంచారు. ఆ పెంచిన పే గ్రేడ్ లు schedule-II లో పొందుపరచి ఉండగా, వాటిని అమలు చేయమని అందరూ HoD లను ఆదేశించాలసింది పోయి, కేవలం 2015 నాటి పే స్కేల్ తో 2022 పే స్కేల్ను పోల్చుకుని కరెస్పాండింగ్ పే స్కేల్ మాత్రమే ప్రభుత్వం ఈ రోజు అన్నీ HoD లకు పంపడం అన్యాయం కాదా? ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు,ఇవ్వాల్సి డిఏ & పిఆర్శీ అరియర్సు, పెండింగు ఉన్న మూడు కొత్త డిఏ లు కోసం అడుగుతుంటే, కేవలం దాచుకున్న డబ్బులు కొంత చెల్లిస్తూ… ఉద్యోగులు బకాయిలన్ని తీర్చేసామని గౌఃఆర్ధిక శాఖ మంత్రి గారు అసంబ్లీసాక్షిగా చెప్పడం అన్యాయం కదా?
11 వ పిఆర్శీ అరియర్సు ఇమ్మని అడుగుతీంటే ఎవరికి ఎంతవస్తుందో లెక్కలు కట్టి సర్వీస్ రిజిష్టర్ లో ఎంట్రీ వేసి, రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని వారం రోజులు క్రితం ప్రభుత్వం మెమో జారీ చేయడం అన్యాయం కాదా..!? ఒకటో తారీకు జీతాలు పెన్షన్లు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎప్పుడైతేo…జీతాలు, పెన్షన్లు ఇస్తున్నాం కదా…అని స్వయంగా గౌ||మంత్రులే వ్యక్యానించడం అన్యాయం కాదా? గతంలో కూడా ఎన్నడూ లేని విదంగా ప్రతి విషయంలోనూ ఉద్యోగులకు నష్టం కలిగించేలా చర్యలు చేపట్టి అన్యాయం చేస్తున్నారని అందులో బాగంగా 11 వ పిఆర్శీ ద్వారా ఎంతో జీతాలు పెరుగుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశేమిగిల్చారు. దశాభ్దాలు గా ఉద్యోగులకు ఉన్న రాయితీలను తీసేసి గత ఏడాదిలో జరిగిన ఉద్యమం ద్వారా మళ్లి వాటిని కూడా తగ్గించి అదే పిఆర్శీ అని నమ్మబలికించారు. అయినప్పటికీ ప్రభుత్వఉద్యోగులకు గత ఏడాది చర్చలద్వారా ఇచ్చిన కొన్ని హామీలు ఇప్పటికీ అమలు చేయడంలేదు. ఇది అన్యాయం కదా? మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్కుటూరూల్ జరుగుతున్న సందర్బంగా విజయవాడలోఉన్న ప్రధాన కార్యాలయాలు సందర్శన అనంతరం హెల్తు యూనివర్సీటీ వద్ద బొప్పరాజు వెంకటేశ్వర్లు మిడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో బాగస్వామ్యం అంటూనే ఉద్యోగులకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని 11 వ పిఆర్శీ ద్వారా ఉద్యోగులకు రావల్సి అరియర్సు మొత్తం నాలుగు నెలలో చెల్లిస్తామని గత ఏడాది పిభ్రవరిలో గౌఃముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చిన నేటికీ అమలు కాకపోవడం బాధాకరమని తెలిపారు.
ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు అంటే… మేము దాచుకున్న మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి మహా ప్రభో అని ఏక వైపు, మరో వైపు మాకు రావల్సిన డిఏలు, డిఏ అరియర్సు, పిఆర్శీ అరియర్సు, సరండర్ లీవ్ డబ్బులు, మెడికిల్ రీయింబర్స్ మెంటు డబ్బులు వేలకోట్లు రూపాయలు ఉద్యోగులకు చెల్లించాల్సిన వాటిపై కనీసం ఎంత మొత్తం చెల్లించాలి? ఎంత మొత్తం చెల్లించారు? ఎంత మొత్తం ఇంకా బకాయిలు ఉన్నాయి ? అని చెప్పే వారే లేరు. ఉద్యోగులు దాచుకున్న వాటిలో ప్రభుత్వం వాడుకున్న డబ్బులు ఈనెలాఖరుకు మూడువేల కోట్లు రూపాయలు వేస్తామని హామి ఇచ్చారు అందులో ఎంతవరకు వేసారోకూడా తెలియదు కాని ఆర్దికశాఖామాత్యులు మాత్రం అసంబ్లీ సాక్షిగా అసంబ్లీలో అడుగుపెట్టేసరికే ఉద్యోగులకు ఇవ్వల్సిన బకాయిలన్ని చెల్లించే అసెంబ్లీలో అడుగుపెట్టానని చెప్పినట్లు మిడియాలో చూసామని,మంత్రి గారు చెప్పిన ఈ మాట నిజమైతే దేనికి ఎన్నికోట్లు ఉద్యోగుల ఖాతాలలో జెమ చేసారో ఆవివరాలు కూడా అసంబ్లీ సాక్షిగా వెళ్లడిస్తే సంతోచిస్తామని ఏదిఏమైనా సరే గౌ|| ఆర్ధిక మంత్రి గారు ఇచ్చిన హామిని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని బొప్పరాజు విజ్ఞప్తి చేసారు. ఏది ఏమైనా సరే ఉద్యోగ,ఉపాధ్య,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పై గతనెల 13 న ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఇచ్చిన 50 పేజీల మెమోరాండం లో ఆర్దిక,ఆర్దికేతర మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తక్షణమే సిపియస్ రద్దు చేయాలని, ఔట్ సోర్శింగు ఉద్యోగుల జీతాల పెంపు తదితర అనేక ప్రధాన సమస్యలపై స్పస్టత లేక పోతే మాత్రం ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో ఈ వర్కుటూల్ కొనసిగించడమే కాకుండా భవిష్యత్ లో ఈ ఆందోళణా కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని ఎపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు తెలిపారు.
వర్క్ టూ రూల్ మొదటి రోజు:
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఆఫీసు సిబ్బంది వర్కుటూరూల్ ను పాటిస్తూ టైమ్ టూ టైమ్ విధులు నిర్వహించి మొదటిరోజు విజయవంతం చేసారని బొప్పరాజు & దామోదరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి ఈశ్వర్, రాష్ట్ర గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్లయ్యా, నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యస్.మల్లీశ్వర రావు, గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.సాంబశివరావు NTR జిల్లా కార్యదర్శి బత్తిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.