-ప్రధానిని కలిసి జమోరె ప్రాధేయపడలేదా?
-అవకాశవాద రాజకీయాలు ఎవరివో ప్రజలందరికీ తెలుసు
-ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి టిడిపిని పిలవక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి
-గోడ మీద పిల్లి వాటంలా వ్యవహరిస్తూ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారి సంకన చేరాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం
-అయినా రెండు మూడు స్థానాలు గెలిచేదే కష్టమైతే, కేంద్రంలో మా మద్దతుతోనే ప్రభుత్వమని వెధవ బిల్డప్పులు ఎందుకు?
-వైఎస్ వివేకా హత్య కేసు డైరీని సుప్రీం కోర్టుకు సమర్పించాలనడమే డాక్టర్ సునీత విజయానికి నిదర్శనం
-ప్రభుత్వ అధినేత దుర్మార్గుడైతే అతన్ని ఎదుర్కోవడం ఎంతో కష్టం
-ఎన్ని కష్టాల నైనా సరే… మేరు నగధీరుడు వలే ఎదుర్కొంటున్న పద్మ విభూషణ్ రామోజీరావు
-జగన్ బటన్ నొక్కినా… విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ కాని నగదు
-జగనన్న తోడు పథకానికి ప్రచారార్బాటమే ఎక్కువ
-జగనన్న చెప్పాడంటే చేయడంతే…. పోలవరాన్ని సర్వనాశనం చేసింది మన ప్రభుత్వం కాదా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి జమోరె ప్రాధేయపడింది నిజం కాదా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రధానమంత్రిని ఎంతగా ప్రాధేయపడినా ఎన్డీఏ కూటమిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకునేది లేదని ఛీ… పొమ్మనలేదా?? అంటూ నిలదీశారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
ఎన్ డి ఏ కూటమి, మన పార్టీని దగ్గరకు రానివ్వదు . ఎందుకంటే ప్రజల్లో ఎంతో చెడ్డ పేరు ఉన్న పార్టీ ఎవరు చేరదీయరు. రేపు బిల్లుల కోసం వాడుకుంటున్నారు తప్ప, మనల్ని దగ్గరకు రానివ్వరు , గజ్జి కుక్కను చూసినట్లు మన పార్టీని చూస్తారన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తెలుగుదేశం పార్టీని పిలువక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
టిడిపి ఈ సమావేశానికి హాజరు కానంత మాత్రాన, ఎన్డీఏ కూటమి నుంచి ఆహ్వానం అందలేదని అనుకోవడం మన అజ్ఞానాన్ని, అవివేకాన్ని తెలియజేస్తుందన్నారు. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. 2024 లో తమ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని గోడ మీద పిల్లి వాటంలా ఎవరు వ్యవహరిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారు.
కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే ఆయన సంకలో చేరేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఏర్పడితే ఆయన సంకనెక్కాలని చూస్తున్నారు. రాష్ట్రంలో రెండు నుంచి మూడు స్థానాలను గెలువ లేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడమా?, ఆశ్చర్యం కాకపోతే అంటూ అపహాస్యం చేశారు. ఆ రెండు, మూడు స్థానాలు గెలిచేది కూడా డౌటే. కడప స్థానం కూడా కైవసం చేసుకోవడం కష్టమే. అంత మాత్రానికి ఎందుకు ఈ వెధవ బిల్డప్ లు అంటూ ఎద్దేవా చేశారు.
సిబిఐ ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. డాక్టర్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయలేదు. దీనితో, సిబిఐ ఈ కేసును సపోర్టు చేస్తుందా?, అపోజ్ చేస్తుందా?? అని న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
సునీత తరపు న్యాయవాది కలుగజేసుకొని ఇలా ఉంది పరిస్థితి అర్థమయిందా? అంటూ ధర్మాసనానికి నివేదించారు. సిబిఐ ని కౌంటర్ దాఖలు చేయాలని, ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఫైల్ ను సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు డైరీ ని సుప్రీం కోర్టుకు సమర్పించాలని పేర్కొనడం జరిగింది.
కేసు డైరీ ని సుప్రీం కోర్టుకు సమర్పిస్తే, ఖాన్ తో గేమ్స్ ఆడ వద్దన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. కేసు డైరీలో అన్ని వివరాలు ఉంటాయి. వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం అందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్లుగా కూడా కేసు డైరీలో నమోదు చేయడం జరుగుతుంది. కేసు డైరీ ని సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, తన తండ్రి హంతకులకు, సూత్రదారులకు శిక్ష పడాలని పోరాడుతున్న డాక్టర్ సునీతకు ఉపశమనం లభించినట్లే.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు స్టే విధించడం వల్ల ఆయన్ని జైల్లో పెట్టారని ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురాగా, హత్య కేసులో ఆధారాలు ఉన్నప్పుడు కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దీనితో ఈ కేసులో జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి తో పాటు ఇతరులవరికి బెయిల్ లభించే అవకాశం లేదన్నది నా భావన. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది.ఈ కేసు విచారణ ను తిరిగి సెప్టెంబర్ 11వ తేదీ తర్వాత వారానికి వాయిదా వేయడం జరిగిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
దుర్మార్గుడిని ఎదుర్కోవడం కష్టం… ప్రభుత్వాధినేతే దుర్మార్గుడైతే చాలా కష్టం
దుర్మార్గుడిని ఎదుర్కోవడం కష్టం. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఇంకాస్త కష్టం. ప్రభుత్వాధినేతే దుర్మార్గుడైతే అతన్ని ఎదుర్కోవడం చాలా… చాలా కష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగిన మేరు నగధీరుడు, చెప్పాలంటే ఒక్క మగాడు… పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు . ఈ వయసులోనూ దుర్మార్గులను ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ఆయన చేస్తున్న పోరాటానికి హ్యాట్సాఫ్. మీ వయసుతో పోలిస్తే యువకులమైన నావంటి వారందరికీ, మీ పోరాటం స్ఫూర్తిదాయకం.
గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడిన స్వతంత్ర సమరయోధులతో సమానం మీ పోరాట స్ఫూర్తి. ప్రస్తుత పాలకులతో పోల్చి చూస్తే, బ్రిటిష్ వాళ్లు పాపం చాలా మంచి వాళ్ళు. ప్రస్తుత పాలకులు దరిద్రులు. ఇటువంటి దుష్టులపై పోరాడుతున్న మీ పోరాటానికి ప్రజలందరి మద్దతు ఉంది. ఈ పోరాటంలో విజయం మీదే. నిజాలను చెబుతున్న మీ వెంటే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను వీడి ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలలో చేరినట్లుగా ఈనాడు దినపత్రిక రాసిన కథనానికి సరైన సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వ పెద్దలు , సాక్షి దిన పత్రికలో రామోజీ క్షుద్ర రాతలని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పాఠశాలలు ప్రారంభమైన తరువాత కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని రాయించుకోవడం సిగ్గుచేటు.
ప్రైవేటు పాఠశాలలలో చేరిన విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరుతారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మార్గదర్శిపై కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో కాకుండా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మార్గదర్శి సంస్థ అధినేత రామోజీరావు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.
అలాగే ఆ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులోనే ఉంది. అయినా, కక్ష కార్పన్యంతో మార్గదర్శిపై ఏడు కేసులు నమోదు చేసి, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.
క్రైస్తవ మిషనరీ స్కూల్ విద్యార్థుల తల్లుల అకౌంట్లో అమ్మఒడి నగదు జమ
అమ్మ ఒడి నగదును విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి జమోరె బటన్ నొక్కినప్పటికీ, ఇప్పటికీ సగం మంది తల్లుల ఖాతాలోకి నగదు జమ కాలేదు. క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల తల్లుల అకౌంట్లో మాత్రం నగదు జమయింది. విద్యార్థులందరికీ అమ్మ ఒడి నగదును అందచేయవలసిందే. నేను కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్లలో విద్యాభ్యాసం చేశాను.
జగన్ మావయ్య బటన్ నొక్కిన తల్లుల ఖాతాలో నగదు జమ కాలేదని బాధపడుతున్న విద్యార్థులు… జగన్ మావయ్యే ఆ డబ్బులను నొక్కేశారా? అని విద్యార్థులు అనుమానిస్తున్నారు. జమోరె బటన్ నొక్కితే ఎన్ని డబ్బులు రాలాయి?, రాలాల్సిన డబ్బులు ఎన్ని? అని ఆర్థిక శాఖ మంత్రి వివరణ ఇవ్వాలి.
సాక్షి దినపత్రికలో అబద్దాలను రాసుకుని, సాక్షి మీడియాలో అబద్దాలను ప్రసారం చేసుకున్నంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. ప్రజల్లో కూడా అమ్మఒడి డబ్బులు అందని తల్లులు ఎంతోమంది ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం పేరు మార్చి, జగనన్న తోడు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెడుతోంది.
ఈ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చేది తక్కువ కాగా, ప్రచార ఆర్భాటం కోసం చేసిన ఖర్చు ఎక్కువ. సాక్షి దినపత్రికలో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు ఆ సొమ్ముతో మరి కొంతమందికి లబ్ది చేకూర్చవచ్చు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకి ఇచ్చేది కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమేనని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
మా పార్టీ వాళ్లే ఫ్లెక్సీలు వేసి… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేసినట్లుగా కలరిచ్చే ప్రయత్నం
యువ గళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేసినట్లుగా ఒక ఫ్లెక్సీ ని మా పార్టీ వారే వేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేసినట్లయితే, దివంగత నాయకుడు హరికృష్ణ ఫోటో వేసి ఉండేవారు. హరికృష్ణ ఫోటో వేయకుండా, ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారంటే అది మా పార్టీ వారి పని. ఇటువంటి తింగరి వేషాలు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని ఉంటే, అపహాస్యం పాలై ఉండేవారు కాదన్నారు.
యువ గళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అప్రహతీతంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వామనుడు మూడు అడుగుల స్థలాన్ని అడిగి రాక్షసుణ్ణి పాతాళానికి తొక్కి వేసినట్లుగా, నారా లోకేష్ కూడా రాక్షసుడిని తొక్కి వేసేటట్టుగా ఎదిగిపోయాడనడం లో సందేహం లేదు. నారా లోకేష్ ఎక్కడ సమావేశం నిర్వహించిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే పాదయాత్ర చేయలేక ముగిస్తాడని కొందరు ప్రచారం చేశారు.కానీ నారా లోకేష్ పట్టుదలతో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.
జగనన్న చెప్పాడంటే చేయడంతే అధికారంలోకి రావడానికి దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తానని చెప్పి, ఇప్పుడు ఆ మాటే మరిచారు. మద్యం వినియోగం తగ్గి ఆదాయం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదం. ఆడాన్ డిస్టలరీ ద్వారా నగదులో విక్రయిస్తున్న మద్యం లెక్కలోకి రావడం లేదు. అలాగే సరిహద్దు ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే, తెలంగాణ నుంచి నాణ్యమైన బ్రాండ్ల మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అది కూడా ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు.
ఒకవైపు జమోరె బ్రాండ్స్, మరొకవైపు తెలంగాణ బ్రాండ్స్ తో రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వినియోగం తగ్గి ఆదాయం పెరిగిందని చెబుతోంది. ఆదాయం పెరిగింది అంటే ప్రజల జేబులకు రాష్ట్ర ప్రభుత్వం చిల్లు వేసినట్టే లెక్క. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందజేస్తున్న నగదును, రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రాబట్టుకుంటుంది. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేకపోయినప్పటికీ, అప్పులు మాత్రం అడ్డగోలుగా చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 700 కోట్ల రూపాయలను రుణంగా పొందారు. ఈ పనులను మెగా సంస్థకు కట్టబెట్టినట్లు ఈనాడు దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమయింది. అది డెఫినెట్ గా పెద్ద కేసు అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదు. పోలవరం ను సంక నాకించారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నాయుడు కారణమని జల వనరుల శాఖ మంత్రి పేర్కొనడం సిగ్గుచేటు. 72 శాతం పనులను పూర్తి చేసిన వ్యక్తి పోలవరం ఆలస్యానికి కారణం ఎలా అవుతారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు శాతం పనులను కూడా పూర్తి చేయకుండా, సర్వనాశనం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరిట కావలసిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. సాక్షి దినపత్రికలో అబద్దాలను ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు.
ఈ ప్రభుత్వం పోవడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ సమావేశాల అనంతరం రాష్ట్ర రాజకీయ పొత్తులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.