Suryaa.co.in

Andhra Pradesh

రైతులకు చేసిన సాయం.. వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా కాకాణి చెప్పినవన్నీ కట్టుకథలే

• దేవాలయం లాంటి శాసనసభలో మంత్రి అవాస్తవాలు చెప్పి, ఆత్మస్తుతి పరనిందకే పరిమితమయ్యాడు
• రైతుభరోసా కేంద్రాలు వైసీపీ వారికి వరంగా.. రైతులకు శాపంగా మారింది నిజం కాదా కాకాణి?
• విత్తనాలు, ఎరువులు సహా సర్వం రైతుభరోసా కేంద్రాలే అందిస్తున్నాయంటున్న కాకాణి ఆ కేంద్రాల్లో ఉండే సిబ్బంది అర్హతలు..అనుభవం ఏమిటో చెప్పాలి
• కోర్టులో ఫైళ్లు కొట్టేసినప్పుడు తనను ఎవరూ ప్రశ్నించలేదన్న ధైర్యంతోనే కాకాణి అలవోకగా అసెంబ్లీలో అసత్యాలు చెప్పాడు
– తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

శాసనసభ సాక్షిగా వ్యవసాయమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అవాస్తవాలు చెప్పి ఆత్మస్తుతి పరనిందకే పరిమితమయ్యాడని, నాలుగేళ్లలో జగన్ రెడ్డి వ్యవసాయరంగా నికి, రైతులకు ఎంతో మేలుచేశాడంటున్న మంత్రికి ఏమాత్రం కనీస అవగాహన, పరి జ్ఞానమున్నా…టీడీపీ విసిరే సవాల్ ను స్వీకరించాలని టీడీపీప్రభుత్వంలో రైతాంగానికి వ్యవసాయరంగానికి ఒనగూరిన ప్రయోజనాలపై బహిరంగచర్చకు వచ్చే ధైర్యం మంత్రి కి ఉందా అని టీడీపీ నేత, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి ధాతులోప నివార ణకు అవసరమైన సూక్ష్మపోషకాల్ని కూడా ఉచితంగా అందించింది. భూమిలోని ధాతు లోపాన్ని గుర్తించి దాన్ని లేకుండా చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని నాడు చంద్ర బాబు భావించారు. అదేవిధంగా ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఒక్క ఎకరంలోనైనా ఉచితంగా భూసారపరీక్షలు జరిపించి, ధాతులోప నివారణకు ఏవైనా చర్యలు తీసు కున్నాడా?

బీడుభూములు, కొండభూములతో పాటు, వాగులు, వంకల్లో నిరుపయోగంగా ఉన్న భూముల్ని సాగులోకి తీసుకురావడం కోసం నాడు టీడీపీప్రభుత్వం రైతులకు అవసర మైన ట్రాక్టర్లు, ఇతర యంత్రపరికరాలు సబ్సిడీపై అందించింది. తన నాలుగేళ్ల పాలన లో జగన్ రెడ్డి అదేవిధంగా రైతులకు ఎలాంటి పరికరాలు.. యంత్రాలు అందించి..ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చాడో మంత్రి కాకాణి చెప్పగలడా? ఈ ప్రభుత్వం రైతుల్ని కొన్ని గ్రూపులుగా ఏర్పాటుచేసి ఇచ్చామంటున్న పరికరాలు ఎక్కడైనా పని చేస్తున్నాయా?

జగన్ రెడ్డి పాలనలో ఒక్క ఎకరాకు కొత్తగా నీరందించినట్టు కాకాణి నిరూపిస్తాడా?
నీటి వనరుల కల్పనలో భాగంగా సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం రూ.68వేలకోట్లు కేటాయించి వాటిలో రూ.64 వేలకోట్లు ఖర్చుపెట్టింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 23 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది. 32 లక్షల ఎకరాలు స్థిరీకరించడంతో పాటు, 7 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎకరాకు అదనంగా నీరిచ్చారా? ఒక్క టంటే ఒక్క ప్రాజెక్ట్ ను అయినా మొత్తం పునాది దశనుంచి నిర్మించి ప్రారంభించారా?

సాగునీటి పారుదల రంగానికి నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం కేవలం రూ.22వేలకోట్లు మాత్రమే కేటాయించింది. ఆ సొమ్ముని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ అయి న పీ.ఎల్.ఆర్ లాంటి సంస్థలకు దోచిపెట్టడానికే కేటాయించారుతప్ప, ఎక్కడా కనీసం టీడీపీప్రభుత్వంలో తవ్విన కాలువల్లో పూడిక కూడా తీయించలేదు.

నాలుగేళ్లలో జగన్ రెడ్డి వైఎస్ఆర్ జలకళ ద్వారా ఎన్ని ఎకరాల్లో బోర్లు వేయించి…ఎందరు రైతులకు ఉచితంగా మోటార్లు, విద్యుత్ కనెక్షన్ అందించాడో చెప్పగలవా కాకాణి?
ఎన్టీఆర్ జలసిరి పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్ని బోర్లు వేయించి, ఎన్నింటికి మోటార్లు బిగించి, సోలార్ కనెక్షన్లు ఇచ్చిందో మేం ఆధారాలతో సహా నిరూపించగలం. అదే విధంగా వైఎస్సార్ జలకళ పథకంతో జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఎందరు రైతుల్ని ఉద్ధరించాడో కాకాణి చెప్పాలి. బోర్ వెల్స్ వాహనాలు, రిగ్ మిషన్లకు వైసీపీ రంగులేసి, తమ్మేనేని సీతారామ్ రియల్ ఎస్టేట్ భూముల్లోబోర్లు వే శారు తప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఒక రైతు భూమిలో ఒక్క బోర్ వేసింది లేదు. ఎన్ని బోర్లు వేయించి, ఎన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, ఎందరు రైతుల పొలాల్లో వైఎస్సార్ జలకళ పథకం ద్వారా నీళ్లు పారించారో కాకాణి చెప్పగలడా?

విద్యుత్ సౌకర్యం లేని చోట ఎన్ని రైతుల బోర్లకు సోలార్ ప్యానెళ్లు బిగించారో చెప్పగలడా? ఈ ప్రభుత్వాన్ని నమ్మి బోర్లు వేసిన పాపానికి బోర్ వెల్స్ యజమానాలు చివరకు రాష్ట్రం వదిలి పారిపోయారని నీకు తెలియదా కాకాణి?
రాష్ట్రంలో రైతులు తమ సొంతంగా బోర్లు వేయించుకొని దాదాపు 18,57,000 పంపు సెట్లకు సొంతడబ్బుతో విద్యుత్ కనెక్షన్ పొంది వారి పొలాలకు నీళ్లు పారించుకుం టున్నారు. ఆ విధంగా దాదాపు 30లక్షల ఎకరాలకుపైగా నీరు అందుతోంది. ఆ విధం గా తక్కువగా లభించే నీటితోనే ఎక్కువ భూమి సాగులోకి రావాలని టీడీపీ ప్రభుత్వం రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ విధానం అందుబాటులోకి తెచ్చింది. డ్రిప్ , స్ప్రింక్లర్ విధానం దేశంలోనే సమర్థవంతంగా అమలుచేసిన రాష్ట్రంగా టీడీపీప్రభుత్వంలో ఏపీ గుర్తింపు పొందింది.

ఆ విధానంతో అదనంగా 10లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థ మొత్తం వైసీపీప్రభుత్వంలో పనికి రాకుండా పోయింది నిజంకాదా కాకాణి? సజ్జల రామకృష్ణారెడ్డికి డ్రిప్ పైపులు తయారు చేసే కంపెనీ ఉందని దానికి మేలుచేయడంకోసం ఈ మధ్యనే కాస్త హడావుడి చేశారు తప్ప, ఎక్కడా ఒక్కరైతుకి కొత్తగా అంగుళం పైపు ముక్క ఇచ్చింది లేదు. రాయలసీ మ బిడ్డనని చెప్పుకునే జగన్ రెడ్డి తన నాలుగేళ్ల పాలనలో సీమలోని రైతులకు ఎన్ని ఎకరాలకు డ్రిప్, స్ర్పింక్లర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చాడో కాకాణి చెప్పాలి.

రైతులకు ద్రోహం చేయాలన్న లక్ష్యంతో జగన్ రెడ్డి ఇచ్చిన జీవోలసంగతేమిటి కాకాణి?
జీవోనెం -22 ద్వారా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను తీసుకొచ్చింది జగన్ రెడ్డి కాదా కాకాణి? రైతులకి నష్టం కలిగించేలా జీవోనెం – 99 తీసుకొచ్చి, రైతు లకు అందాల్సిన రూ.8 వేలకోట్ల రుణమాఫీ సొమ్ము (టీడీపీప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము) వారికి దక్కకుండా చేసింది జగన్ రెడ్డి కాదా?
జీవో నెం – 464 తో సున్నా వడ్డీ పథకం పరిమితిని మూడు లక్షల నుంచి కేవలం రూ.1లక్షలోపు రుణం తీసుకునే వారికే పరిమితం చేసిన దుర్మార్గపు చరిత్ర మీ ప్రభుత్వానిది కాదా? జీవో నెం – 96 తో కౌలురైతులకు కులాన్ని ఆపాదించి వారి నోట్లో మట్టికొట్టింది జగన్ రెడ్డి సర్కార్ కాదా? ఇలాంటి దారుణాల గురించి అసెంబ్లీలో చెప్పకుండా రైతుల్ని, వ్యవసాయాన్ని జగన్ రెడ్డి ఉద్ధరించాడని చెప్పడానికి సిగ్గుందా కాకాణి?

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4007కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం రూ.1900కోట్లు మాత్రమే చెల్లించాడు
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు రూ.4007 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో చచ్చీ చెడి ఇచ్చిన ఇన్ పుట్ సబ్సిడీ కేవలం రూ.1900 కోట్లు. ఇంత తక్కువ మొత్తం ఇచ్చి, రైతుల్ని ఆదుకున్నామని కాకాణి చెప్పడం నిజంగా సిగ్గుచేటు . గోదావరి జిల్లాల్లో వరి రైతులు అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోతే వారికి ఈ ప్రభుత్వం రూపాయి ఇచ్చింది లేదు. మాండూస్ తుఫాన్ తో ధాన్యం తడిచి మొలకలు వస్తే.. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు మంత్రి కారుమూరికి చెబితే, ఆయన వర్షాలొస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని రైతుల్ని వెర్రిపప్పలని హేళనగా మాట్లా డింది నిజం కాదా కాకాణి?

మంత్రి కాకాణి అయినా.. అంతకుముందన్న మంత్రి కన్న బాబు అయినా.. జగన్ రెడ్డి అయినా బటన్ నొక్కిన ప్రతిసారీ పంటలబీమా సొమ్ము అందరు రైతులకు వచ్చినట్టు నిరూపించగలరా? 2022 జూన్లో జగన్ రెడ్డి పంటల బీమా పథకం చెల్లింపులకోసమని రూ.2917 కోట్ల సొమ్ముకు సంబంధించి బటన్ నొక్కి తే, ఆ సొమ్ము ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి చేరలేదన్నది వాస్తవం కాదా కాకాణి?

రాష్ట్రంలో ఒక్కరైతుకైనా రైతురుణమాఫీ సొమ్ము అన్నివాయిదాలు సక్రమంగా అంది నట్టు కాకాణి నిరూపించగలడా?
రైతు భరోసా కింద ప్రతి రైతుకి ఏటా రూ.12,500లు ఇస్తానన్న జగన్ రెడ్డి, కేవలం రూ.7,500లు మాత్రమే ఇస్తున్నది నిజంకాదా? ఆ సొమ్ముకూడా అందరికీ కాకుండా కొందరికే ఇస్తున్నది నిజంకాదా? 52లక్షల పైచిలుకు రైతులకు పీఎం కిసాన్.. రైతు భరోసా సొమ్ము ఇచ్చామని అసెంబ్లీలో కాకాణే చెప్పాడు. మరి కేంద్రప్రభుత్వమేమో ఏపీలో పీఎం కిసాన్ యోజన కింద 32లక్షల మంది రైతులకే ఇస్తున్నట్టు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం 52,57,000 రైతులకు పీఎంకిసాన్.. రైతుభరోసా సాయం అందిస్తు న్నట్టు నిరూపించే దమ్ము ధైర్యం నీకున్నాయా కాకాణి?

కోర్టుల్లో ఫైళ్లు దొంగతనం చేసిన దానికంటే తేలిగ్గా మంత్రి కాకాణి తనని ఎవరు ప్రశ్నిస్తారులే అన్న ధైర్యంతో అసెంబ్లీలో అలవోకగా అబద్ధాలు చెప్పాడు. పీఎం కిసాన్ – రైతు రుణమాఫీ సొమ్ము ఒక్క రైతుకైనా అన్ని వాయిదాల సొమ్ము మొత్తం సక్రమంగా అందిందని కాకాణి నిరూపించగలడా? సాగునీటి రంగాన్ని సర్వనాశనంచేసిన ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ఆ రంగంపై అబద్ధాలు, అసత్యాలు చెప్పాడు. చంద్రబాబు ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి అనేక రకాల చర్యలు తీసుకొని 2లక్షల హెక్టార్లలో ఆక్వాసాగు అయ్యేలా చేస్తే, జగన్ రెడ్డి వచ్చాక అన్నిధరలు పెంచి, జోన్, నాన్ జోన్ అని ఆక్వాసాగు మొత్తం నాశనం చేశాడు.

జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆక్వాతో పాటు ఫౌల్ట్రీస్, ఫిషరీస్ సహా పాడిపరిశ్రమ కూడా దారుణంగా దెబ్బతిన్నది నిజం కాదా? లక్షలకోట్ల అప్పులు తెస్తున్న జగన్ రెడ్డి పాడి రైతులకు పశువులబీమా సొమ్ము చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. ఒక్కో గేదెకు రూ.30వేల పరిహారం ఇస్తానని చెప్పి, రూపాయి ఇవ్వకుండా పాడిరైతుల్ని వంచించాడు.

గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు వారికి బోనస్ ఇస్తే, జగన్ రెడ్డి అదే రైతుల పొట్టకొడుతూ కమీషన్లు దండుకుంటున్నాడు
వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలను ఆదుకోవడానికి.. వాటిని నిలబెట్టడానికి చంద్రబాబునాయడు దూరదృష్టితో అనేక నిర్ణయాలు అమలుచేశారు. నెల్లూరులో ధాన్యం రైతులకు పుట్టికి రూ.200బోనస్ ఇచ్చి ఆదుకున్నారు. మిర్చి రైతులు తెగుళ్లతో నష్టపోతే ప్రతి క్వింటాకు రూ.1500 అదనపు బోనస్ రైతులకు అందించారు. ఈ విధంగా శనగ… పసుపు…ఉద్యానవన రైతుల్ని నాడు టీడీపీ ప్రభుత్వం బోనస్ లు ఇచ్చి ఆదుకుంది.

ఈ ప్రభుత్వంలో జగన్ రెడ్డి తన దోపిడీకోసం బోనస్ ల స్థానంలో కమీషన్లు తీసుకొచ్చి రైతుల్నినిలువునా దోచేస్తున్నది నిజం కాదా కాకాణి గోవర్థన్ రెడ్డి? పంటలు వేయకపోయినా.. వేసినట్టు రికార్డుల్లో రాసి వైసీపీ నేతలకు ఎకరాకు రూ.90వేల లెక్కన పంట నష్టపరిహారం అందించారు. ఎవరైతే రైతు భరోసా కేంద్రాల్లో పెత్తనం చేయగలరో వారికే ప్రభుత్వం నిస్సిగ్గుగా పంటనష్టపరిహారం అందించింది.

కౌలురైతులు..రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండు, మూడుస్థానాల్లో నిలవడాన్ని ఎలా సమర్థించుకుంటావు కాకాణి?
ప్రకృతి ప్రభావంతో రైతులు నష్టపోవడం అనేది సహజం. దానిపై కూడా నీతిమాలిన ప్రచారం చేయడం వైసీపీవారు చేసినట్టుగా మేం చేయలేం. జగన్ రెడ్డి వచ్చాక వర్షాలు పడ్డాయంటున్న కాకాణి.. ఆయన దరిద్రం వల్లే అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నా యని, తెగుళ్లు.. పురుగులతో పాడైపోయాయని చెప్పగలడా? జగన్ రెడ్డి హాయాంలో రాష్ట్రం రైతులు, కౌలురైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండు, మూడు స్థానాల్లో నిలవడా న్ని ఎలా సమర్థించుకుంటావు కాకాణి? రైతుల ఆత్మహత్యలపై జగన్ రెడ్డికి.. వ్యవ సాయమంత్రికి బాధ్యత లేదా? పత్తి, మిరప వంటి వాణిజ్యపంటలు తెగుళ్లు, వైరస్ లతో దెబ్బతింటుంటే, పంటను కాపాడుకోవడానికి అప్పులుచేసి రైతులు పోరాడుతుం టే, వారిని ఆదుకోవడానికి జగన్ సర్కార్ గానీ, రాష్ట్ర వ్యవసాయశాఖ గానీ నాలుగేళ్లలో ఏవైనా చర్యలు తీసుకుందా కాకాణి?

రైతు భరోసా కేంద్రాలు వచ్చాక రైతులు సంతోషం గా ఉన్నారని చెబుతున్న కాకాణి… రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయని నిరూపించగలడా? ఆ కేంద్రాల్లో నిష్ణాతులై న , అనుభవం కలిగిన సిబ్బంది ఉన్నారని చెప్పగలడా? పంటలకు వచ్చే తెగుళ్లు.. పురుగులను పోగొట్టే మందులు అడిగిన వెంటనే అందించే సిబ్బంది ఉన్నారా? రైతు భరోసా కేంద్రాలు రైతులు అడిగిన వెంటనే సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తు న్నాయా? ఇవేవీ చేయనప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఎందుకున్నాయో…ఎవరికి మేలుచేస్తున్నాయో కాకాణే చెప్పాలి. రైతులు పండించే ధాన్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టూ కాకాణి గోవర్థన్ రెడ్డి వయా కొడాలినాని విధానంలో దోచిపెట్టడాని కి మాత్రమే రైతుభరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నది నిజం కాదా కాకాణి?

ధాన్యం రైతులకు వైసీపీ ప్రభుత్వం మధ్ధతు ధర ఇవ్వడంలేదని ప్రతి క్వింటాల్ ధాన్యానికి రైతు రూ.250లు నష్టపోతున్నాడని వైసీపీ ఎంపీనే రాజ్యసభలో చెప్పింది నిజంకాదా గోవర్థ న్ రెడ్డి? ధాన్యం కొనుగోళ్లకోసం వైసీపీ ప్రభుత్వం రూ.60వేలకోట్లు ఖర్చుపెట్టినట్టు కాకాణి చెప్పాడు. ఆ సొమ్ములో రూ.20వేలకోట్ల సొమ్ము వైసీపీ నేతలకోసమే లూఠీ జరిగింది నిజం కాదా? ఇప్పటికైనా కాకాణి, ముఖ్యమంత్రి రైతుల విషయంలో అబద్ధా లుచెప్పడం మానుకోవాలి.” అని మర్రెడ్డి హితవుపలికారు.

LEAVE A RESPONSE