– మన రాష్ట్రం..మన పోలీసులు..మన ఆసుపత్రి అయ్యేసరికి పట్టాభికి తగిలిన దెబ్బలు వైద్యులకు కనిపించలేదా?
• గన్నవరం విధ్వంసకాండ ముమ్మాటికీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమే. పోలీసులు, వైసీపీ అరాచకశక్తుల సామూహికంలో జరిగిన దురాగతం.
• దొంతుచిన్నాను ఫోన్లో బెదిరించిన వైసీపీవారిపై పోలీసులు తొలుత చర్యలు తీసుకొని ఉంటే, గన్నవరం విధ్వంసకాండ జరిగేదా జాషువాగారు?
• సీఐ కనకారావు తలపగలగొట్టడానికే పట్టాభి విజయవాడ నుంచి గన్నవరం వచ్చాడా ఎస్పీగారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
గన్నవరం విధ్వంసకాండపై కృష్ణాజిల్లాఎస్పీ జాషువా చెప్పివన్నీ పచ్చి అబద్ధాలేనని, అక్క డ జరిగిన దారుణాలన్నీ రక్షకులు భక్షకులు సామూహికంగా జరిపినవేనని టీడీపీ పొలి ట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివ రాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“ గన్నవరం విధ్వంసకాండపై కృష్ణాజిల్లా ఎస్సీ జాషువా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే. విధ్వంసకాండ మొత్తం రక్షకులు, భక్షకులు ఏకమై చేసిన దాడికాదా ఎస్పీ గారు? గన్నవరం విధ్వంసకాండ ముమ్మాటికీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమే. పోలీసులు, వైసీపీ అరాచకశక్తుల సామూహికంలో జరిగిన దురాగతమని కరాఖండిగా చెప్పగలం. మనరాష్ట్రం.. మనపోలీసులు..మన ఆసుపత్రి అయ్యేసరికి పట్టాభికి తగిలిన దెబ్బలు వైద్యులకు కనిపించలేదా? దొంతుచిన్నాని, అతనికుటుంబాన్ని ఫోన్లో బెదిరించిన వైసీపీమూకలపై పోలీసులుచర్యలు తీసుకొని ఉంటే, గన్నవరం విధ్వంసకాండ జరిగేదా ఎస్పీగారు?
విజయవాడలో కాకుండా, ఏ హైదరాబాద్ లోనో, లేక ఎంపీ రఘురామకృష్ణంరాజుని పరీక్షిం చిన ఆర్మీ ఆసుపత్రిలోనో పరీక్షచేయిస్తే, పట్టాభిని పోలీసులు ఎంత దారుణంగా హింసించారో ప్రపంచానికి తెలిసేది. పట్టాభిని కొట్టలేదన్న ఎస్పీ మాటలు అబద్ధాలకే పెద్ద అబద్ధం. పట్టాభిని కొట్టకపోతే, అతను సరిగా అన్నంకూడా తినలేని స్థితిలో ఎందుకున్నాడో ఎస్పీగారు సమాధానం చెప్పాలి. మనరాష్ట్రం.. మనపోలీసులు.. మనఆసుపత్రి అయ్యేసరికి పట్టాభిరి తగిలిన దెబ్బలు వైద్యులకు కనిపించకుండా పోయాయా ఎస్పీగారు?
వైసీపీగూండాలు తమపార్టీకార్యాలయంపై దాడిచేసి, టీడీపీనేతలు, కార్యకర్తల్ని గాయపరిచారని తెలిశాక పట్టాభి గన్నవరంవెళ్తే అదితప్పా ఎస్పీగారు? దొంతుచిన్నాను ఫోన్లో బెదిరించిన వ్యవహారం లో పోలీసులు తొలుత చర్యలు తీసుకొనిఉంటే, గన్నవరం విధ్వంసకాండ జరిగేదా ఎస్పీ గారు? వల్లభవనేని వంశీ దారుణాతిదారుణంగా తనను, తన కుటుంబసభ్యుల్ని దుర్భాషలా డారని దొంతుచిన్నా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, అతని గురించి స్థానిక వైసీపీ నేతలకు చెప్పింది మీ పోలీసులుకాదా? టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడిచేయ కముందు, వంశీనే స్వయంగా రెక్కీ నిర్వహించింది నిజంకాదా? తన మనుషులు, వైసీపీ గూండాలను దాడిచేయమని పంపించింది వంశీ కాదా? వంశీ ఆదేశాలతో టీడీపీ కార్యాలయం పై దాడికి తెగబడిన వైసీపీ గూండాలను పోలీసులు నిరోధించలేకపోయింది నిజంకాదా? వైసీపీ గూండాలు పిచ్చిపట్టినట్టు టీడీపీ కార్యాలయంపై దాడిచేసి, అక్కడున్న ఫర్నిచర్, ఇతరసామగ్రి ధ్వంసంచేస్తుంటే, వాహనాలకు నిప్పుపెడుతుంటే పోలీసులు వారిని బాబ్బా బు..అన్నా..తమ్ముడూ అని బతిమాలుతారా?
సీఐ కనకారావుని కులంపేరుతో దూషించి, అతని తలపగలగొట్టడానికే పట్టాభి గన్నవరం వెళ్లాడా ఎస్పీగారు?
వైసీపీ గూండాలు దాడిచేస్తున్నప్పుడే, వారిలో ఎవడో విసిరిన రాయి అక్కడున్న సీఐ తలకు తగిలి గాయమైంది. సీఐకి అయిన గాయాన్ని పోలీసులు వైసీపీకి అనుకూలంగా మార్చి కట్టుకథలు అల్లి, పట్టాభిపై తప్పుడుకేసులు పెట్టారు. పట్టాభి విసిరినరాయే సీఐకి తగిలిందని ఎస్పీ ఎలా చెబుతారు? రాయిపై పట్టాభి పేరుందా? సీఐ కనకారావుని కులంపేరుతో తిట్టి, అతని తలపగలగొట్టడానికే పట్టాభి విజయవాడనుంచి గన్నవరం వచ్చాడా ఎస్పీగారు? బీసీ వర్గానికిచెందిన టీడీపీనేత దొంతుచిన్నా కారుకి నిప్పుపెట్టిన వారిపై ఎలాంటి కేసులు లేవు. దొంతుచిన్నా ఇంటికివెళ్లి, అతన్ని అతనిభార్యను బెదరించినవారిపై, ఫోన్లుచేసి దుర్భాషలాడిన వారిపై కేసులుపెట్టి, చర్యలుతీసుకున్న దాఖాలాలులేవు. టీడీపీ కార్యాల యంపై దాడిచేసిన గుంపులో ఒక్కరినీ అరెస్ట్ చేయకుండా, చేసిన వారిపై తూతూమంత్రంగా బెయిలబుల్ కేసులు పెడతారా? ఈ చర్యలని కృష్ణాజిల్లా ఎస్పీ గారు ఎలా సమర్థించుకుంటారు?
పట్టాభిని సాధించాలనుకుంటున్నవారి కుట్రలో భాగమైన సీఐకనకారావుకి ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి, డీజీపీలే బాధ్యులు
సీఐ కనకారావు తనగుండెలపై చేయివేసుకొని నిజం చెప్పాలి. పట్టాభి నిజంగా మిమ్మల్ని కులంపేరుతో దూషించాడా? పట్టాభి లాంటి పరిణితి కలిగిన రాజకీయనేత ఒక సీఐని అకారణంగా కులంపేరుతో దూషిస్తాడా? పట్టాభిని సాధించాలనుకున్నవారి కుట్రలో భాగమైన సీఐ కనకారావు సురక్షితమేనా అన్నఅనుమానం కలుగుతోంది. కనకారావుని ఏదైనా చేసి, ఆ వ్యవహారంలో పట్టాభిని, టీడీపీని ఇరికించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు అంతటిఘనులే. కనకారా వుకి చిన్నగాయమైతే అతన్ని ఐసీయూలో ఎందుకు పెట్టారో జాషువా చెప్పాలి. కనకారావు భద్రంగా, తమ రక్షణలో ఉన్నాడని జాషువా తక్షణమే మీడియావారికి చెప్పాలి. డీజీపీ తక్షణమే సీఐ కనకారావుకి తగిన భద్రత కల్పించాలి. వివేకాహత్య నేపథ్యాన్ని గమనిస్తే, సీఐ కనకారావు ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రస్తుత రాష్ట్రపరిస్థితుల్లో పట్టాభిని సాధించాలనుకుం టున్న వారికి పావుగామారిన కనకారావుకి ఏదైనాజరిగితే ముఖ్యమంత్రి, డీజీపీలే బాధ్యులు అవుతారు. గన్నవరం హింసాకాండను పోలీస్ వ్యవస్థ ఎలా సమర్థించుకుంటుంది? నీ బాంచన్ దొరా అని ఊడిగంచేస్తూ, తప్పులమీద తప్పులుచేస్తున్న పోలీస్ అధికారులందరూ టీడీపీప్రభుత్వం రాగానే భారీమూల్యం చెల్లించుకుంటారు” అని రామయ్య హెచ్చరించారు.