– నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణ లో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలన ను ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. మేము వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గం. నేను ప్రస్తుతం కుటుంబం తో దైవదర్శనం చేసుకివడానికి వేరే రాష్ట్రానికి వచ్చాము.. రేపు సాయంత్రం హైదరాబాద్ కు వస్తాం వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెప్తాను.