Suryaa.co.in

National

ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌ నిషేధం

– భారత ఎన్నికల కమీషన్ సిఫారసు

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం, ప్రచారం చేయడంపై కొంత పరిమితి ఉండాలని స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రాజీవ్ కుమార్ ఓటర్ ఐడిలతో ఆధార్‌ను లింక్ చేయడానికి నోటిఫికేషన్‌లు జారీ చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరడంతో పాటు పలు ఎన్నికల సంస్కరణలపై సిఫార్సులను చేశారు.

అర్హులైన వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు అర్హత తేదీలను అనుమతించడంతో పాటు, అభిప్రాయ సేకరణలను నిషేధించే కమిషన్ ఇదివరకు చేసిన ప్రతిపాదనలను ఆయన పునరుద్ధరించారు. అలాగే ఒక అభ్యర్థి పోటీ చేసే సీట్లను కేవలం ఒక దానికి పరిమితం చేయాలని కూడా కమిషన్ కోరుతున్నది.

LEAVE A RESPONSE