Suryaa.co.in

Telangana

బడి బాటను ప్రారంభించిన ఉప సభాపతి పద్మారావు

– చిన్నారుల పుస్తకాలకు లక్ష విరాళం :

సికింద్రాబాద్ పరిధిలోని 10 ప్రభుత్వ స్కూల్ లను రానున్న రోజుల్లో అభివృధి చేస్తున్నామని, ప్రయివేటు కార్పోరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ స్కూల్ లను తీర్చి దిద్దుతామని ఉప సభాపతి పద్మారావు అన్నారు. ప్రభుత్వ స్కూల్ లు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సోమవారం నుంచి పునః ప్రారంభమైన నేపధ్యంలో పద్మారావు సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించారు. విద్యార్దులకు ఉచితంగాDSC-0046 నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సితాఫలమండీ లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను స్థాపించిన ఘనత తమదేనని, కొత్త భవనాలను కూడా నిర్మించి తీరుతామని పద్మారావు తెలిపారు. స్కూల్ లో విద్యార్ధుల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ, నోటు పుస్తకాల లేవని పలుఫురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు తమ గోడును వేలిబుచ్చుకున్నారు. వెంటనే స్పందించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్ తన వ్యక్తిగత విరాళంగా లక్ష రూపాయలను ప్రకటించి, డబ్బులను ఉపాధ్యాయులకు అందించారు. వెంటనే పిల్లలకు నోటు పుస్తకాలు కొని పెట్టాలని సూచించారు. ఉపDSC-0045 సభాపతి పద్మారావు గౌడ్ స్పూర్తితో అదే కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెరాస నేత గరికపోగుల చంద్ర శేఖర్ రూ.50 వేలు, జీ చ్ ఎం సీ ఎగ్జి కిటీవ్ ఇంజినీర్ ఆశాలత రూ.20 వేలు, జలమండలి జనరల్ మేనేజర్ రమణా రెడ్డి రూ. 15 వేల మేరకు విరాళాలను పిల్లల పుస్తకాలకు అందించారు. ఉప సభాపతి పద్మారావు గౌడ్ స్పూర్తితో అయన వద్ద అంగ రక్షక (గన్ మ్యాన్) విధులు నిర్వర్తించే శ్రీ ఆంజనేయులు కూడా వెంటనే రూ.10 వేల విరాళాన్ని అందించారు. స్కూల్ విద్యార్ధులకు పుస్తకాలు అందాలన్న స్పూర్తిని ప్రదర్శించిన దాతల విరాళాల పట్ల పద్మారావు గౌడ్ అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు కృతఙ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE