ఆంధ్రప్రదేశ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి ఇన్నాళ్లూ మూడు నెలల వరకు ఉన్న గడువును ఆరునెలలకు పెంపు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకునే పేద ప్రజలకు ఎంతో వెసులుబాటు కలగనుంది.
అనివార్యకారణాల వల్ల ఆసుపత్రి ఖర్చులను మూడు నెలల్లోపు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించలేనివాళ్లకి ఇదెంతో ఉపశమనంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ని మంత్రులు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడమైనదని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు, అనుమానాలున్నా సీఎం కార్యాలయంలో సత్యనారాయణ, వినయ్ కాంత్ లను సంప్రదించగలరు.