Suryaa.co.in

Telangana

కెసిఆర్, కేటీఆర్ విజన్ తో విస్తృతంగా రాష్ట్ర అభివృద్ధి

తొర్రూరు పట్టణాభివృద్ధి పరుగులు
మున్సిపాలిటీ సమున్నత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
మున్సిపాలిటీ అయిన కొన్నేండ్ల లోనే మారిన రూపురేఖలు
మొత్తం రూ. 120 కోట్ల నిధులు
రూ.27 కోట్లతో పట్టణంలో త్వరలో ఇంటింటికీ 24 గంటలపాటు మంచినీరు
ఇప్పటికే వార్డు కో కోటి రూపాయలతో ప్రగతి పనులు
14 కోట్లతో వర్షపు నీటిని వడిసిపట్టే ప్లాంట్
రెండు కోట్లతో దోబీ ఘాట్ లు
సర్వాంగ సుందరంగా తొర్రూరు పట్టణం
మినీ ట్యాంక్ బండ్ గా తొర్రూరు పెద్ద చెరువు
అన్ని హంగులతో అద్భుతంగా ఆడిటోరియం, యతిరాజారావు పార్క్
మరో 5 కోట్ల తో అంబేద్కర్ భవన్ బుడగ జంగాల భవన్ కమ్యూనిటీ హాల్స్
రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం తొర్రూరు
కష్ట కాలంలో నన్ను ఆదుకున్నారు
మీ రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాను
నేను ఎవరికీ ద్రోహం చేయలేదు

– తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి ఉత్సవాల సందర్భంగా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ కుట్టు మిషన్ల పంపిణీ సఫాయి కార్మికులు సిబ్బంది అధికారులకు సన్మానం తదితర కార్యక్రమాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు జూన్ 16 : కేసీఆర్, కేటీఆర్ విజన్, అద్భుతమైన ఆచరణతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విస్తృతంగా జరుగుతున్నది. అందులో భాగంగా తొర్రూరు పట్టణాభివృద్ధి పరుగులు పెడుతున్నది. మున్సిపాలిటీ సమున్నత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాను. మున్సిపాలిటీ అయిన కొన్నేండ్ల లోనే తొర్రూరు రూపురేఖలు మారాయి. రూ. 120 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

రూ.27 కోట్లతో పట్టణంలో త్వరలో ఇంటింటికీ 24 గంటలపాటు మంచినీరు అందించనున్నాను. ఇప్పటికే వార్డు కో కోటి రూపాయలతో ప్రగతి పనులు జరుగుతున్నాయి.14 కోట్లతో వర్షపు నీటిని వడిసిపట్టే ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నాను. రెండు కోట్లతో దోబీ ఘాట్ లు నిర్మాణం అవుతున్నాయి. తొర్రూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాను. మినీ ట్యాంక్ బండ్ గా తొర్రూరు పెద్ద చెరువును మారుస్తున్నాను.

అన్ని హంగులతో అద్భుతంగా ఆడిటోరియం, యతిరాజారావు పార్క్ ను ఏర్పాటు చేశాను. మరో 5 కోట్ల తో అంబేద్కర్ భవన్, బుడగ జంగాల భవన్ కమ్యూనిటీ హాల్స్ ను నిర్మిస్తున్నాను. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం తొర్రూరు. కష్ట కాలంలో నన్ను ఆదుకున్నారు. మీ రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. అని మంత్రి చెప్పారు. తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి ఉత్సవాల సందర్భంగా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ కుట్టు మిషన్ల పంపిణీ సఫాయి కార్మికులు సిబ్బంది అధికారులకు సన్మానం తదితర కార్యక్రమాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

ముందుగా బస్ స్టాండ్ నుండి నిర్వహించిన భారీ ర్యాలీలో పట్టణ మున్సిపాలిటీ ట్రాక్టర్ నడుపుతూ మంత్రి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.అనంతరం సభలో పట్టణం లో రెండో విడత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టుమిషన్ల ను పంపిణీ చేశారు. పట్టణ మున్సిపాలిటీ అధికారులకు, సిబ్బందికి, సపాయిలకు సన్మానం చేశారు.

తొర్రూరు లో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేశారు. బస్తీ దవాఖానా కు ప్రారంభోత్సవం చేశారు. స్మశాన వాటికలో లయన్స్ క్లబ్ అధ్వర్యంలో రేవూరి సోమయ్య స్మరకార్థం ఏర్పాటు చేసిన గదికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎల్ వై అర్ గార్డెన్ లో పట్టణ ప్రగతి సమావేశం జరిగింది.
పట్టణ ప్రగతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఒకప్పుడు తొర్రూరు నగరం మురికి నరక కూపంగా ఉండేది. తొర్రూరు మున్సిపాలిటీగా మార్చుకున్నాం. ఇక అప్పటినుండి నిధులను మంజూరు చేసుకుంటూ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. సీఎం కేసీఆర్ విజన్ మంత్రి కేటీఆర్ ఆచరణతో వారి సహకారంతో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రజల్ని భాగస్వాములను చేసుకుంటూ, తొర్రూరు పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపించుకుంటున్నాం అని తెలిపారు.

పట్టణ ప్రగతి – తొర్రూరు మున్సిపాలిటీ TUFIDC మొదటి విడత నిధుల మంజూరి 20 కోట్లు, TUFIDC రెండవ విడత నిధుల మంజూరి 20 కోట్లు, స్పెషల్ ఫండ్ ద్వారా నిధుల మంజూరి 3 కోట్లు, సీఎం కెసిఆర్ గారి SDF ద్వారా నిధుల మంజూరి 25 కోట్లు, మంత్రి KTR గారి SDF ద్వారా నిధుల మంజూరి 25 కోట్లు, అమృత్ పథకం ద్వారా నిధుల మంజూరి ( వాటర్ ట్యాంకులు & పైప్ లైన్ల నిర్మాణం) 27 కోట్లు, మొత్తం మంజూరైన నిధులు – 120 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అని మంత్రి వివరించారు.ఈ ఏడాదితో అభివృద్ధి అద్భుతంగా జరిగి తొర్రూరు పట్టణ రూపురేఖలే మారుతాయి అని మంత్రి తెలిపారు.

పట్టణ ప్రగతి ద్వారా నిధులు పట్టణంలో పట్టణ ప్రగతి కింద 4 కోట్లు మంజూరయ్యాయి. 6,110 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నది. 445 మందికి కెసిఆర్ కిట్లు అందాయి. అని మంత్రి చెప్పారు.

తొర్రూరు సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. పట్టణంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ చేస్తున్నాం. పట్టణంలో నెలకు రూ.35.75 లక్షలు 1470 పెన్షన్లు, ఏడాదికి రూ.కోటి రూపాయలు 1282 మందికి రైతుబంధు, రూ.80 లక్షలు 16 మందికి రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రూ.5కోట్లు 513 మందికి ఇస్తున్నామన్నారు.

పట్టణంలోని 386 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 365 సంఘాలకు రూ.16.5 కోట్లు బ్యాంకు లింకెజి రుణాలు ఇవ్వగా, స్త్రీ నిధి ద్వారా 320 సంఘాలకు రూ.5.45 కోట్లు ఇవ్వగా, వడ్డీలేని రుణాల కింద 365 సంఘాలకు రూ. 16.5 కోట్లు ఇచ్చామని మంత్రి వివరించారు.

మున్సిపాలిటీ ఏర్పాటు జరిగిన తర్వాత 20 కోట్లతో తొర్రూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్, మొక్కల పెంపకం, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, కొత్త రోడ్లు, మోడల్ ఇంటిగ్రేటెడ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, యతిరాజారావు పార్క్, అదే పార్క్ లో పిల్లల పార్క్ ను ఏర్పాటు చేశాం.

మరో 20 కోట్లతో స్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సీసీ రోడ్డు, నగరంలో ప్రధాన రోడ్లను డబుల్ రోడ్డు, దుబ్బ తండ, sc కాలనీలో కూడా స్మశాన వాటికలు నిర్మిస్తున్నాం. ప్లాస్టిక్ ద్వారా దారం తయారు చేసే సాంకేతికత వచ్చిందని చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్ల ను ఉచితంగా ఇస్తాను. శిక్షణ తీసుకొని బాగు పడాలి. అలాగే పసుపు, కారం వంటి చిన్న తరహా పరిశ్రమల కోసం మహిళలకు వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు ఎంత అడిగితే అంత ఇప్పిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

పట్టణ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. గతంలో పట్టణం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ప్రజలు విశ్లేషించుకోవాలి. సీఎం కెసిఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, టీఆరెఎస్ కు అండగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రజల రుణ తీర్చుకుంటాను.

అలాగే తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు తనకు అండగా తొర్రూరు ప్రజలు నిలబడ్డారు. వాళ్లకు అండగా ఉండటమే నేను చేస్తున్నది. నిరంతరం పట్టణ, ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్నాను. ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. అని మంత్రి దయాకర్ రావు అన్నారు.
నేను ఎవరికీ ద్రోహం చేయలేదు

నేను నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు. నాకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా ఇబ్బందులు పెట్టలేదు. భూ కబ్జా లకు పాల్పడ లేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు చెడ్డ పేరు తేలేదు. తేను. అని ఉద్వేగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక నూతన మున్సిపాలిటీ చట్ట0 వచ్చింది. ఇది దేశంలోనే ఉత్తమ చట్టం. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగింది. పరిపాలన ప్రజలకు చేరువైంది. కేంద్రం మన చట్టాలని అంభినందిస్తున్నది. అత్యంత వేగంగా తొర్రూరు అభివృద్ధి జరుగుతున్నది. తొర్రూరు మున్సిపాలిటీ ఒకప్పుడు 110 వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 31వ స్థానానికి చేరుకుంది. అని వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE