Suryaa.co.in

Telangana

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

ఏడుగురు సజీవ దహనం.. ఇప్పటివరకు 9 మంది మృతి..
బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు..
ఓ మార్వాడీ వ్యాపారి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం..
స్థానికులు పలుమార్లు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ వ్యాపారి..

ఫలితంగా ఈ రోజు ఈ ప్రమాదం?
ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు
నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని వివరించారు.

తెలంగాణ అగ్నిప్రమాద మృతుల వివరాలు :

 

రెండవ అంతస్తు :

(1) మహ్మద్ ఆజమ్, 54
(2) మహ్మద్ హసీబుర్ రెహమాన్ ,
(3) రెహానా సుల్తానా , 50
(4) తహూరా ఫర్హీన్, BDS doctor , 38
(5) తూభ, 5
( 6 ) తరూబా, 12
(తహూరా ఫర్హీన్ ఇద్దరు పిల్లలు )

(7) ఫైజా సమీన్ , 25 అవివాహిత

BDS డాక్టర్ తహూర ఫర్జీన్ ఈ బిల్డింగ్ లో నివాసం వుండరు. సెలవులు వుండడం తో పిల్లల తో పాటు బంధువుల ఇంటికి వచ్చింది.

మూడవ అంతస్తులో :

(8) జకీర్ హుస్సేన్
(9) నిక్కత్ సుల్తానా

 

LEAVE A RESPONSE