జగతి మెచ్చిన మన జాతి పిత..!

జగతిన అత్యున్నత పురస్కారం నోబుల్
మన బాపూజీకి
రాలేదు..అది పిటీబుల్..
ఆయన అంతకు
మించిన సింపుల్..
అసలైన మానవతకు శాంపుల్!
అయితే..నోబుల్ ను మించి
మహాత్ముడు సాధించుకున్నది
ప్రపంచం మొత్తం శిరసు వంచి చేసే నమస్కారం..
ఒక్క మహోన్నత జాతికి పిత
అనే పురస్కారం..!

సువిశాల ప్రపంచంలో
ఏ దేశానికేగినా
బాపూ బొమ్మ..
ఇంకే నాయకునికీ
దక్కలేదు కదా
అంతటి గొప్ప జన్మ!
ఆయన ప్రతిపాదించిన అహింస..
ఇప్పుడైంది మానవజాతికి
పరమోధర్మ..!

ఎదిరించిన దక్షిణాఫ్రికాలో
మహాత్ముడంటే ఆరాధన..
ఆయన సిద్ధాంతాల సాధన..
తరిమికొట్టిన దొరల సామ్రాజ్యంలోనూ
ఆయన సామ్రాట్టే..!

ఒక్కో దేశానికి ఒక్కో మహానేత
ఎవరి గొప్ప వారిది
ఆయుధం పట్టక
ధర్మాన్ని వీడక
అసత్యమన్నది పలుకక
కట్టుబట్ట మార్చక
కట్టుబాటు విడువక
బోసి నవ్వుతో
ఆ అందరినీ
తోసి రాజన్న
మహానేత..మన జాతిపిత!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply