Suryaa.co.in

Telangana

ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవు

-కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాలకు పరాకాష్ట
-బిజెపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
-దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావు
-రాజకీయ దురుద్ధేశం తోటే కవిత కు నోటుసులు
-బీజేపీ సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం
-కేసులు,జైళ్లు మాకు కొత్త కాదు
-2001 లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇదే
-మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

సూర్యాపేట : బిజెపి ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమే యం ఎల్ సి కవిత కు ఈడీ నోటీసులు ఇవ్వడం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఈ ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది చక్కటి నిదర్శనమన్నారు.

దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరిపి నోటీసులు ఇచ్చినట్లు లేదని రాజకీయ దురుద్ధేశంతోటే నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.బిజెపి కి చెందిన ఓ యం పి చేసిన ఆరోపణలను బేస్ చేసుకునే యం ఎల్ సి కవిత కు నోటీసులు ఇచ్చిన విషయం బహిరంగ రహస్యమే నని ఆయన వెల్లడించారు. బిజెపి పాలకులకు కంట్లో నులుసుగా మారిన ఢిల్లీలోని ఆప్, తెలంగాణా లోని బి ఆర్ యస్ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమే ఇది అని ఆయన స్పష్టం చేశారు.

తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతియ్యాలి అన్నది మోడీ సర్కార్ యోచనగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉడకవన్నారు.నియంతలు ఎప్పుడూ నిలబడిన దాఖలాలు లేవని,ప్రపంచంలో అంతం కాబడిన నియంతల కంటే మోడీ గొప్పోడు కాడని ఆయన చెప్పారు. ఇటువంటి కేసులతో బి ఆర్ యస్ ను నిలువరించడం అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరోటి ఉండబోదని ఆయన బిజెపి నేతలకు చురకలు అంటించారు.

మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని,బిజెపి సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. కేసులు,జైళ్లు మాకు కొత్త కాదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి కుట్రలను ఛేదించడం కష్టతరం కాబోదన్నారు.తెలంగాణా రాష్ట్ర సాధన కోసం 2001లో ఉద్యమం మొదలు పెట్టిన రోజునే వీటికి సిద్ధమై ముందుకు సాగినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అవిర్బావించిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE