నకిలీ కేసులో హైకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా

23

– సిట్‌ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు
– కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన నకిలీ కేసులో హైకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. కల్పితమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసీఆర్ అబద్ధాలను హైకోర్టు పూర్తిగా ఎండగట్టింది. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండడంతో, ఆయనే ఈ ఎపిసోడ్ ను సృష్టించారన్న బిజెపి ఆరోపణలు నిజమని ఈ తీర్పు రుజువు చేస్తోంది.

నీతి నిజాయితీలకు కట్టుబడిన జాతీయ నాయకులను ఈ వ్యవహారంలోకి లాగి కేసీఆర్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. అతని ఊహల్లోంచి పుట్టిన ఈ తప్పుడు కేసు కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేశారు. అంతేకాకుండా అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, సంస్థలను నిర్వీర్యం చేశారు. ఐపీఎస్‌ అధికారులు వాస్తవాలను వెల్లడించకపోవడం దురదృష్టకరం. అధికారం చేతిలో పెట్టకొని ఏమైనా చేయొచ్చనుకునే కేసీఆర్ లాంటి వాళ్లకు ఈ తీర్పు కళ్లు తెరిపించాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయి, బెదిరింపులకు లొంగవు. వాస్తవాన్ని పునరుద్ఘాటిస్తున్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను.