వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్ -3లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలకు అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి.