Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం మనకు గర్వకారణం

– సీఎం నారా చంద్రబాబు నాయుడు

మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణం. ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించండి. అలాగే జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోండి. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయి. అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

LEAVE A RESPONSE