కడప : కడప స్థానిక రిమ్స్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవా సమితి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిమ్స్ సిప్పండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. బిజెపి కార్యకర్తలు సత్య కుమార్ పై ఉన్న అభిమానంతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అందులో నేను భాగస్వామ్యం పొందడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభా బాయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మరియు మీ అభిమాన నాయకులు గాని హీరో హీరోయిన్లు జన్మదినాలను సేవా మార్గంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి వ్యవస్థాపకుడు , ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ కు బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్లకి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఊరటను ఇస్తాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ కు వచ్చిన 400 పైగా మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్.ఎం.ఓ శ్రీనివాసులు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జగదీష్, బిజెపి కార్యకర్తలు రాఘవ, అంబిక, బాలకృష్ణ, మరియు సంస్థ సభ్యులు, రిమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.