కపిల్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్స్ కోట్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసెందుకు వచ్చిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో కపిల్ దేవ్ మంగళవారం కలవటం జరిగింది. ఎంపి కేశినేని శివనాథ్ కపిల్ దేవ్ కి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించటంతో పాటు శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ ఎపి క్రికెట్ కి సంబంధించి కపిల్ దేవ్ తో చర్చించారు. ఎసిఎ అధ్యక్షుడిగా రాష్ట్రంలో క్రికెట్ డెవలప్మెంట్ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంపి కేశినేని శివనాథ్ వివరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విశాఖ- విజయనగరం మధ్యలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఎంపి కేశినేని శివనాథ్ , కపిల్ దేవ్ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు