మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామం

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామం

– వచ్చేది టీడీపీ ప్రభుత్వమే
– జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– ఆకివీడు పార్టీ నేతలతో నారా చంద్రబాబునాయుడు
రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. ఆకివీడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆ ప్రాంత నేతలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. జగన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. నాయకులు అందరినీ కలుపుకుని వెళ్లాలి. సమర్థులైన అభ్యర్థుల ఎంపికతో పాటు వారు నిత్యం ప్రజల్లో ఉండేలా చూడాలి. వైసీపీ ఎంత బెదిరించినా క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలి.
జగన్ రెడ్డి అవినితి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. అది ఏ స్థాయిలోనైనా సరే. నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అవసరమైతే పార్టీ ఏ స్థాయిలోనైనా కొత్తరక్త ఎక్కిస్తాం. ఆకివీడు, కుప్పంలో టీడీపీ గెలిచేస్థాయిలో ఉంది. చివరకు రెండు మున్సిపాలిటీలను పోగొట్టుకున్నాం. ప్రత్యర్థి దుర్మార్గాలను ఎదుర్కొన్నే కొత్త నాయకత్వం లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైంది.
జగన్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగం, డబ్బు, అక్రమ కేసులతో అప్రజాస్వామికంగా గెలిచారు. మున్సిపల్ ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ ఓట్ల శాతం పెరిగింది. ఇది శుభపరిణామం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నంద్యాల, కాకినాడలో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించాం. తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. జగన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది.
జగన్ రెడ్డిపై ఉన్న ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా నేను చూడలేదు. గోదావరి జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళితే.. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయం సాధించలేరు. ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉండి పోరాడి ఓట్లు సాధిస్తారో వారికే పార్టీలో పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున అధ్యయనం చేయడం జరుగుతోంది.
ఈ సమావేశంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివరామరాజు, బోండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి (మల్లికార్జున రావు), కైకలూరు ఇంఛార్జ్ జయమంగళ వెంకటరమణ, నర్సాపురం ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply