పరామర్శించిన టీడీపీ నాయకులు
బందరు మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర విభజన సమయంలో ఢిల్లీలోని పార్లమెంటులో మొదటిసారిగా గుండెపోటు వచ్చింది. ఇది రెండోసారి. రమేష్ ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయనను మచిలీపట్నం మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు.