దేనికి సిద్ధం జగన్ సార్ ?

-విశాఖ అమ్ముతుంటే చూస్తూ ఉండటానికి మీరు సిద్ధమా ?
-రాష్ట్రం మొత్తం అవినీతి మయం
– లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతుంది
-చిన్నాన్నను చంపిన హంతకులను కాపాడేందుకు మాత్రమే డిల్లీ పోతున్నాడు
-విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాంగ్రెస్ ఒప్పుకోదు
-మా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మీ పక్షాన పోరాటం
-విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది
-మీరు ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తామని మాట ఇస్తున్నాం
-మీ చేతిలో చెయ్యేసి మాట ఇస్తున్న
-ఎన్నికలకు ఇంకా రెండు నెలలే ఉంది.ఆలోచన చేసి ఓటు వేయండి
-కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం
-వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
-విశాఖ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో ఏపీసీసీ భారీ బహిరంగ సభ
ఏపీసీసీ వైఎస్ షర్మిలా రెడ్డి

విశాఖపట్నం: విశాఖ ఉక్కు – ఆంధ్రుల ఊపిరి. విశాఖ స్టీల్ ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు ఒక ఎమోషన్,ఒక సెంటిమెంట్. 1960 లో జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ఉక్కు కోసం తెలంగాణ లో సైతం ర్యాలీలు తీశారు. విశాఖ ఉక్కు ఇందిరమ్మ నెలకొల్పిన పరిశ్రమ. నష్టాల్లో ఉంటే నిధులు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది.

వైఎస్సార్ హయాంలో విశాఖ కోసం ఎంతో చేశాడు. వైఎస్సార్ బ్రతికి ఉంటే విశాఖ ఉక్కు కి సొంత మైన్ ఉండేది. 2014 వరకు విశాఖ స్టీల్ లాభాల్లో ఉంది. దొంగలు దొంగలు ఊర్లు దోచుకున్నట్లు… విశాఖ ఉక్కు ను దోచుకోవాలని చూస్తున్నారు. అప్పుల పాలు చేసి దోచుకోవాలని చూస్తున్నారు. అప్పుల పేరు చెప్పి ప్రైవేటీకరణ కు కుట్ర కు తెరలేపారు. కుక్కను చంపాలి అంటే ముందు పిచ్చిది అని పుకార్లు పుట్టించాలి. విశాఖ స్టీల్ అమ్మేందుకు ఇదే సామెత ను అమలు చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ను కాలుకు కాలు నరుకుతున్నరు. ఐరెన్ ఓర్ ఇవ్వడం లేదు,బొగ్గు ఇవ్వడం లేదు,కరెంట్ ఉత్పత్తి కాకుండా చూస్తున్నారు. మొత్తం విశాఖ ను అమ్మాలని చూస్తున్నారు. ఇక్కడ గంగవరం పోర్ట్ ను జగన్ ఆన్న అమ్మేశాడు. కేవలం 600 కోట్లకు అమ్మేశాడు. పక్కనే ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేశారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. విశాఖ భూముల కోసమే ప్రైవేటీకరణ. లాభాల్లో ఉన్న పరిశ్రమను అప్పుల్లో కి కావాలని నెట్టారు.

ఇవాళ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. ఇక్కడ ప్రతిపక్షాలకు సోయి లేదు. పాలకపక్షం,ప్రతిపక్షం రెండు దొందు దొందే. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయను అని జగన్ ఒక తీర్మానం చేశాడు. తీర్మానంతో సరిపెట్టి ఊరుకున్నాడు. తీర్మానం చేసే బదులు ఒక్క ఉద్యమైనా ఎందుకు చేయలేదు ? చంద్రబాబు బీజేపీ తో పొత్తులు పెట్టుకుంటున్నాడు. విశాఖ స్టీల్ ను అమ్ముతుంటే బీజేపీ తో పొత్తుకు పోతున్నారా ? జగన్,బాబు ఇద్దరు మోడీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారు.

ఇలాంటి వాళ్ళను గెలిపించడం అవసరమా? ఇవ్వాళ జగన్ ఆన్న సిద్ధం అంటూ బయలు దేరాడు. దేనికి సిద్ధం అని అడుగుతున్నాం. సిద్ధం అనే పదానికి 600 కోట్లు ఖర్చు చేశాడు. జగన్ కి పబ్లిసిటీ పిచ్చి పట్టిందని జనాలు అడుగుతున్నారు. ఎటు చూసినా సిద్ధం సిద్ధం అంటూ పోస్ట్లర్లు పెట్టాడు. ఒక్కో సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నాడు దేనికి సిద్ధం జగన్ సార్ ? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పులు చేసేందుకు సిద్ధమా ? విశాఖ అమ్ముతుంటే చూస్తూ ఉండటానికి మీరు సిద్ధమా ? ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా?

మీరు సిద్ధం అయితే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. ఒక చెత్త ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలించి నట్లు…. వైసీపీ ఎమ్మెల్యేలు తరలిస్తున్నారు. ఒక ప్రాంతం వ్యక్తిని మరో ప్రాంతంలో సీట్ ఇచ్చాడు. అక్కడ వ్యతిరేకంగా ఉందని తెలుసుకున్నాడు. అందుకే ఎమ్మెల్యేలకు పక్క ప్రాంతాలకు పంపించాడు. సీట్ ఇవ్వక పోతే పార్టీలు మారుతాడు అని భయం. రాష్ట్రం మొత్తం అవినీతి మయం. లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతుంది. 10 ఏళ్ల లో కనీసం రాజధాని కూడా కట్టలేక పోయారు.

రాష్ట్రాన్ని బీజేపీ ఘోరంగా మోసం చేసింది. హోదా లేదు..పోలవరం రాదు. అయినా బీజేపీ కి పోటీ మరి వంగి వంగి దండం పెడతారు. జగన్ ఆన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో చెప్పాడు. హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు జగన్ ఆన్న ఢిల్లీకి పోతున్నాడు..వస్తున్నాడు రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా అడిగారా ? చిన్నాన్న ను చంపిన హంతకులను కాపాడేందుకు మాత్రమే డిల్లీ పోతున్నాడు.

ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. హోదా తోనే రాష్ట్ర అభివృద్ధి. రాహుల్ మాట ఇచ్చారు .10 ఏళ్లు రాష్టానికి హోదా ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే హోదా నిర్ణయాన్ని అమలు చేస్తాం.

Leave a Reply