Suryaa.co.in

Andhra Pradesh

ఎంజేపీ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు

• షూస్, నైట్ డ్రెస్ లు కూడా…
• మంత్రి సవిత అధ్యక్షతన ఎంజేపీ విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం
• ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశలవారీగా టీజీటీ స్కేల్ వర్తింపు
• బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీకి శిక్షణ
• 2 స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు
• బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఆమోదం
• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ఎంజేపీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలురాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపజేయనున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం సోమవారం జరిగింది.

ఈ సమావేశంలో ఆర్థిక, ఆర్థికేతర సంబంధమైన 36 అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించగా, మరికొన్ని అంశాలపై ఆమోదం తెలిపారు. ముందుగా టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సిబ్బందిని మంత్రి సవిత ప్రశంసించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ మరింత పర్సంటేజీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికులు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

ఎంజేపీ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశలవారీగా టీజీటీ స్కేల్ అందజేయాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెర్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు.

ఏంజేపీ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డు ఆఫ్ గవర్నెస్ సమావేశంలో నిర్ణయించారు. రూ.3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందించాలని సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు.

ఎంజేపీ కళాశాలల్లో చదివే బీసీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, షూస్ అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులకు నైట్ డ్రెస్ లు కూడా అందజేయనున్నారు. స్పోర్ట్స్ కిట్లు కూడా ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

2014-19 మధ్య ఏర్పాటు చేసిన 65 ఎంజేపీ విద్యా సంస్థల్లో గెస్ట్ పోస్టుల భర్తీకి బోర్డు సమావేశం నిర్ణయించింది. 65 విద్యా సంస్థల్లో 2 పోస్టుల చొప్పున్న 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. అవరసరమైన కళాశాలల్లో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలని సమావేశంలో ఆమోదం తెలిపారు. వాటితో పాటు కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 715 మంది ఉద్యోగుల పర్మినెంట్ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎంజేపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు నీట్, ఐఐటీలో శిక్షణివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకుగానూ రాష్ట్రంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్లను ఏర్పాటుపై చర్చించారు. సీబీఎస్ఈ విద్యా బోధన సాగిస్తున్న 24 ఎంజేపీ కళాశాల్లో అవసరమైన ల్యాబ్ లతో పాటు మౌలిక వసతుల కల్పనపైనా చర్చించారు. అత్యధిక మంది విద్యార్థులు ఉండే ఎంజేపీల్లో సెకండ్ పీఈటీలను కూడా నియామకంపైనా, రాష్ట్రంలో రెండు బీసీ హాస్టళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడంపైనా చర్చించారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ విద్యా సంస్థల కార్యదర్శి మాధవీలత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి యోగిరెడ్డి, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖాధికారులు సహా పలువురు ఎంజేపీ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE