– ఆక్వా పార్కులు,టెక్స్ టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు మద్దతు ఇవ్వండి
-కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మతాసీతారామన్‌తో పయ్యావుల భేటీ
ఢిల్లీ: రాష్ట్రానికి ఏం కావాలి అనే అంశంపై కేంద్రానికి నివేదిక అందజేశానని… విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.
పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహకారం అందించాలని కోరామన్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో శనివారంజరిగిన ఫ్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పయ్యావుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి సహకారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.పారిశ్రామిక రాయితీలు, పారిశ్రమిక కారిడార్ల ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని, ఆక్వా పార్కులు,టెక్స్ టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు మద్దతు కావాలని కోరామన్నారు. తిరుపతి వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరామన్నారు. రైల్వే జోన్ ఆపరేషన్‌కు సహకారం ఇవ్వాలన్నారు.
రైల్వే జోన్ ఆపరేషన్ కు సహకారం అందించాలన్నారు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకారమంది చాలన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కృషి చేస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు కోరినట్లు చెప్పారు.